వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షానికి చైనా వ్యోమగాములు: భూమికి 380 కి.మీ ఎత్తులో ఫస్ట్‌టైమ్..షాకింగ్

|
Google Oneindia TeluguNews

బీజింగ్: అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించిన దేశంగా గుర్తింపు పొందిన చైనా.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష ప్రయోగాల్లో రోజురోజుకూ పురోగతిని సాధిస్తోంది. కొద్దిరోజుల కిందటే కృత్రిమ సూర్యడిని మండించిన డ్రాగన్ కంట్రీ.. తాజాగా అంతరిక్ష ప్రయోగానికి పూనుకుంది. దీనికోసం ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపించింది. ఆ ముగ్గురూ తమ గమ్యానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని చైనా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ధృవీకరించింది.

భూమికి 380 కిలోమీటర్ల ఎత్తులో చైనా..తనకంటూ ప్రత్యేకంగా ఓ స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకుంది. అంతర్జాతీయ దేశాలు అంతరిక్ష పరిశోధనల నుంచి చైనాను దూరంగా ఉంచిన నేపథ్యంలో- ఆ దేశం సొంతంగా ఈ స్పేస్ స్టేషన్‌ను రూపొందించుకుంది. తాజాగా బయలుదేరి వెళ్లిన ముగ్గురు వ్యోమగాములు ఆ అంతరిక్ష కేంద్రంలోకి దిగారు. నీ హైషెంగ్, లీయూ బోమింగ్, టాంగ్ హోంగ్బో అనే ముగ్గురు వ్యోమగాములు మూడు నెలలపాటు అక్కడే ఉంటారు.

China has launched 3 astronauts into orbit to begin occupation of the new space station

ఏడుగంటల ప్రయాణం తరువాత.. వారంతా సురక్షితంగా స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నట్లు చైనా వెల్లడించింది. అక్కడి నుంచి వారు తమ సంకేతాలను పంపించినట్లు తెలిపింది. ఇదివరకెప్పుడు కూడా చైనా వ్యోమగాములు మూడు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో నివసించ లేదు. దీనితో ఇది చైనా నిర్వహిస్తోన్న అత్యంత సుదీర్ఘ అంతరిక్ష మిషన్‌గా మారింది. అయిదేళ్ల తరువాత చైనా చేపట్టిన తొలి మానవ సహిత మిషన్ కావడం ఆసక్తిని రేపుతోంది.

Recommended Video

Green Fungus Symptoms ముక్కు నుంచి రక్తం , తీవ్ర జ్వరం | Prevention | Black Fungus | Oneindia Telugu

షెన్‌ఝౌ-12 కాప్స్యూల్‌ను అమర్చిన లాంగ్‌మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా ఆ ముగ్గురూ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. గోబీ ఎడారిలోని గ్ఝియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈ లాంగ్‌మార్చ్ 2ఎఫ్‌ను ప్రయోగించారు చైనా శాస్త్రేవేత్తలు. మూడునెలల పాటు స్పేస్ స్టేషన్‌లోగడిపే వ్యోమగాములు తియాన్హె మాడ్యుల్‌ను వినియోగంలోకి తీసుకుని వస్తారు. వారి యాత్ర ప్రధాన ఉద్దేశం కూడా అదే. 16.6 మీటర్ల పొడవు, 4.2 మీటర్ల వెడల్పు ఉండే ఈ మాడ్యుల్‌ను చైనా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగించింది.

English summary
China has launched three astronauts into orbit to begin occupation of the country's new space station. The three men - Nie Haisheng, Liu Boming and Tang Hongbo - are to spend three months aboard the Tianhe module.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X