మరింత ధృఢంగా చైనా- పాకిస్థాన్ ఫెవికాల్ బంధం.. భారత్ అలెర్ట్..!
భారత్ సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్ ల మధ్య ఫెవికాల్ బంధం తాజాగా మరోసారి బయటపడింది. ఇటీవల చైనాలో ఘనంగా నిర్వహించిన 80 వ ఆర్మీ పరేడ్ కు పాకిస్థాన్ కు ఘనంగా ఆహ్వానం పలికింది చైనా. ఈ పరేడ్ కు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హాజరయ్యారు. అయితే చైనా.. భారత్ కు మాత్రం ఆహ్వానం పంపించలేదు. ఇక ఇటీవల చైనా నిర్మించిన ఇంటర్నెట్ ఫైర్ వాల్ అనే నూతన టెక్నాలజీ ద్వారా పాకిస్థాన్ లో సోషల్ మీడియాను ఆ దేశం సెన్సార్ చేస్తున్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇక తాజాగా పాకిస్థాన్- చైనాల మధ్య అనేక కీలక ఒప్పందాలు జరిగాయి. పాకిస్థాన్ స్పేస్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. 2025-2029 యాక్షన్ ప్లాన్ లో భాగంగా పాకిస్థాన్ వ్యోమగాములకు చైనా ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. వ్యోమగాముల శిక్షణ కోసం ఇరు దేశాలు ఓ జాయింట్ ట్రైనింగ్ సెంటర్ ను నెలకొల్పాలని నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ డీల్ ప్రకారం చంద్రుడు, అంతరిక్షంలో పరిశోధనతోపాటు పాకిస్థాన్ భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు చైనా సహకారం అందించనుంది. అలాగే చైనాకు చెందిన స్పేస్ అబ్జర్వేషన్ సిస్టమ్ యాక్సెస్ ను పాకిస్థాన్ కు ఇవ్వనుంది. దాంతో అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్, అర్బన్ ప్లానింగ్, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిశీలన తదితర సేవలను పాకిస్థాన్ వినియోగించుకోనుంది.
అలాగే 2025-2029 యాక్షన్ ప్లాన్ లో భాగంగా పాకిస్థాన్ కు చెందిన 3000 మంది పౌరులకు చైనా ట్రైనింగ్ ఇవ్వనుంది. విద్యా, ఉపాధి అవకాశాల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తేలింది. అప్లయిడ్ అండ్ బేసిక్ సైన్స్ విభాగంలో ఇరు దేశాలు జాయింట్ గా పరిశోధన చేపట్టనున్నాయి. అగ్రికల్చర్, ఏఐ, హెల్త్, న్యూ ఎనర్జీ, ఎయిర్ పొల్యూషన్, హైడ్రో పవర్, క్లైమేట్ ఛేంజ్ తదితర అంశాల్లో పరిశోధన చేయనున్నాయి. అలా చైనా సాయంతో అన్ని రంగాల్లోనూ బలపడాలని పాకిస్థాన్ చూస్తోంది. ఈ క్రమంలో భారత్ అలెర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పటికే చైనా తయారు చేసిన అనేక ఆయుధాలను పాకిస్థాన్ కు సరఫరా చేసింది. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా నుంచి కొనుగోలు చేసిన జే 10 సిరీస్ యుద్ధ విమానాలు, పీఎల్-15 మిసైల్స్ తో భారత్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా- పాకిస్థాన్ సంబంధాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications