చైనాలో పవర్ ప్లాంట్ కుప్పకూలి 68 మంది దుర్మరణం

బీజింగ్: చైనాలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ కుప్పకూలిపోవడంతో 68 మంది కార్మికులు దుర్మరణం చెందారు. తూర్పు చైనాలోని జియాంగ్స్ ఫ్రాన్సిస్ ప్రాంతంలోని ఫంగ్ చెంగ్ లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణంలో ఉంది.

గురువారం ఈ విద్యుత్ ప్లాంట్ దగ్గర పనులు జరుగుతున్నాయి. అయితే ఒక్క సారిగా కట్టడం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 68 మందికి పైగా దుర్మరణం చెందారని చైనాకు చెందిన క్షినువా మీడియా తెలిపింది.

China power plant collapse kills at least 68 people

కట్టడం శిథిలాల కింద వంద మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారని, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+