వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్-రష్యా వార్ : ప్రపంచ శాంతి కోసం చేతులు కలుపుదాం. ! .. జో బైడెన్ తో జిన్ పింగ్

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, ఐరోపా ఆంక్షలను లెక్కచేయడంలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించడంలేదు. న్యాయస్థానం తీర్పును తాము పరిగణలోకి తీసుకోవడంలేదంటూ రష్యా ప్రకటించింది. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే యుద్ధానికి ముగింపు అని స్పష్టంచేసింది. ఉక్రెయిన్ పై దాడులను రష్యా మరింత ఉద్ధృతం చేసింది. నగరాల్లో నివాసప్రాంతాలు, ఆస్పత్రులు, స్కూళ్లను టార్గెట్ చేస్తూ బాంబులతో విరుచుకుపడుతోంది. విధ్యంసం చేస్తోంది. ఎటు చూసినా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

ప్ర‌పంచ శాంతి కోసం చేతులు క‌లుపుదాం..

ప్ర‌పంచ శాంతి కోసం చేతులు క‌లుపుదాం..


ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముగింపు పలకాలని ఈ మేరకు రష్యాను ఒప్పించేందుకు ప్రపంచ దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య వర్చువల్ సంభాషణ జరిగింది. ఉక్రెయిన్ పై రష్యా దాడుల గురించి ప్రత్యేకంగా ఇరువురు చర్చించుకున్నారు. ప్రపంచశాంతి కోసం అమెరికా , చైనా చేతులకు కలపాలని జోబైడెన్ తో జిన్‌పింగ్ అన్నారు. అంతర్జాతీయ బాధ్యతలను భుజానికెత్తుకోవల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.. ఏదేశాల మధ్యనైనా సంబంధాలు యుద్ధం వైపు దారి తీయకూడదని .. శాంతియుతంగా ఉండాలని జిన్ పింగ్ అన్నారు.

 యుద్ధంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు..

యుద్ధంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు..


రష్యా-ఉక్రెయిన్ మద్య జరుగుతున్న యుద్ధవాతావరణ పరిణామాలను ఎవ్వరూ కోరుకోరని జిన్‌పింగ్ అన్నారు. ఈ పరిణామాల వలన ఇరుదేశాలకు ఎలాంటి ప్రయోజనం కూడా లేదని చెప్పారు.. ఉక్రెయిన్ లో నెలకొన్నది ఎవ్వరూ చూడకూడదనుకునే సంక్షోమన్నారు. ఇరుదేశాలు శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. అటు అమెరికా, చైనా దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు సరైనా మార్గంలో పయనించేలా చూడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో అన్నారు.

ఉక్రెయిన్‌లో ప‌రిస్థితుల‌పై భార‌త్ ఆందోళ‌న‌

ఉక్రెయిన్‌లో ప‌రిస్థితుల‌పై భార‌త్ ఆందోళ‌న‌

మరోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్ లో పరిస్థితులు రోజురోజుకు దిగజారడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌కు అవ‌స‌ర‌మైన‌ సాయం అందించేందుకు తమ దేశం ఎప్పుడూ ముందుంటుందని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమతిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్. రవీంద్ర ఐరాస భద్రతా మండలి సమావేశంలో మాట్లాడారు. భారత వైఖరిని స్పష్టం చేశారు. ఉక్రెయిన్-రష్యా మధ్య పరమైన దౌత్య చర్చలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే దాడుల్ని నిలిపివేసి.. పరస్పరం శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

English summary
Let us join hands for world peace. ! .. Jin Ping with Joe Biden
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X