వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోక్లామ్: సమరానికి సై , యుద్ద విన్యాసాలు నిర్వహించిన చైనా

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా..ఇండియాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతోందోననే ఆందోళన నెలకొంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ద విన్యాసాలు నిర్వహించినట్టు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ మీడియా ప్రకటించింది.

మూడు మాసాలుగా చైనా, ఇండియాకు మధ్య డోక్లామ్ సరిహద్దు సమస్య తీవ్ర ఉద్రిక్తలకు కారణమైంది.రెండు దేశాల మధ్య మాటల యుద్దం సాగుతోంది.రెండు దేశాల సైనికులు సరిహద్దు వెంట అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. డోక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా పలుమార్లు కవ్వింపు చర్యలకు దిగింది.

చైనాకు బెదరం, త్వరలో మోడీ, జిన్‌పింగ్‌ల భేటీ?చైనాకు బెదరం, త్వరలో మోడీ, జిన్‌పింగ్‌ల భేటీ?

డోక్లామ్ నుండి భారత్ వెంటనే తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా డిమాండ్ చేస్తోంది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఇండియాను కించపర్చేలా పలు మార్లు కథనాలు కూడ ప్రచురించింది.

తాజాగా డోక్లామ్ విషయమై త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందని కేంద్ర హోమ్‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే చైనా మాత్రం యుద్దానికి సన్నద్దమౌతున్నట్టు కన్పిస్తోంది.

యుద్ద విన్యాసాలు నిర్వహించిన చైనా

యుద్ద విన్యాసాలు నిర్వహించిన చైనా

డోక్లామ్ వివాదం నేపథ్యంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గత వారంలో యుద్ద విన్యాసాలను నిర్వహించినట్టుగా చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది. ప్రత్యక్ష సైనిక యుద్ద సన్నాహల్లో భాగంగా ఈ విన్యాసాలను నిర్వహించినట్టు చైనా ప్రకటించింది.ఆర్మీ ట్యాంకులు, హెలిక్యాప్టర్లను ఉపయోగించినట్టు కూడ గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.

Recommended Video

India to revise rules to downplay Chinese business in the country | Oneindia News
10 పిఎల్ఏ యూనిట్లు యుద్ద విన్యాసాల్లో పాల్గొన్నాయి

10 పిఎల్ఏ యూనిట్లు యుద్ద విన్యాసాల్లో పాల్గొన్నాయి

సాయుధ బలగాలతో కూడిన 10 పిఎల్ఏ సాయుధ బలగాలతో కూడిన 10 పిఎల్ఏ యూనిట్లు ఈ యుద్ద విన్యాసాల్లో పాల్గొన్నాయని గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.సరిహద్దులోని డోక్లామ్ ప్రాంతంలో భారత్- చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ విన్యాసాలు నిర్వహించినట్టు ప్రకటించిన గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.

యుద్ద విన్యాసాలు ఎక్కడ నిర్వహించారో వెల్లడించని చైనా

యుద్ద విన్యాసాలు ఎక్కడ నిర్వహించారో వెల్లడించని చైనా

పీఎల్ఏకు చెందిన వెస్టర్న్ థఇయేటర్ కమాండర్ ఈ యుద్దవిన్యాసాలను నిర్వహించిందని గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది. అయితే ఏ ప్రాంతంలో యుద్ద విన్యాసాలు నిర్వహించారనే విషయమై ఆ పత్రిక ప్రకటించలేదు. భారత్‌తో ఉన్న సరిహద్దు రేఖ పహరా బాధ్యతలను వెస్టర్న్ థియటర్ కమాండ్ పర్యవేక్షిస్తోంది.

ఎత్తైన కొండ ప్రాంతాలపై కాల్పులు

ఎత్తైన కొండ ప్రాంతాలపై కాల్పులు

సైనిక విన్యాసాల్లో భాగంగా ఎత్తైన కొండ ప్రాంతాల్లోని లక్ష్యాలపై సైనికులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత హెలికాప్టర్లు ఉపరితలంపై ఉన్న లక్ష్యాలపై క్షిపణులు ప్రయోగించాయని చైనా సెంట్రల్ టెలివిజన్ ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. డోక్లామ్ ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌ను బెదరగొట్టేందుకు ఈ సైనిక విన్యాసాలు నిర్వహించినట్టు గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.

English summary
A state-run newspaper in China reported that the Chinese PLA recently conducted military drills aimed at striking awe in India and laying the ground for plateau warfare as the two countries remain engaged in a two-month-long standoff in Doklam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X