మీ గొడవ, భారత్‌తో చర్చించుకోండి: పాకిస్తాన్‌కు చైనా భారీ షాక్
పాకిస్తాన్‌కు చైనా గట్టి షాకిచ్చింది. కాశ్మీర్ విషయంలో భారత దేశంతో మీకు మీరే పోరాడాలని ఐక్య రాజ్య సమితిలో చైనా స్పష్టం చేసింది.
ఢిల్లీ: పాకిస్తాన్‌కు చైనా గట్టి షాకిచ్చింది. కాశ్మీర్ విషయంలో భారత దేశంతో మీకు మీరే పోరాడాలని ఐక్య రాజ్య సమితిలో చైనా స్పష్టం చేసింది.

అది మీ గొడవ
తద్వారా కాశ్మీరుపై పెడబొబ్బలు పెడుతున్న పాకిస్థాన్‌కు చైనా భారీ షాకిచ్చింది. పాకిస్థాన్‌కు మద్దతిచ్చేందుకు చైనా నిరాకరించింది. కాశ్మీరు వివాదం ద్వైపాక్షిక సమస్య అని స్పష్టం చేసింది. ఇది భారతదేశం, పాకిస్థాన్ మధ్య వివాదమని పేర్కొంది.

పాకిస్తాన్‌కు గట్టి షాక్
దీనిలో జోక్యం చేసుకోబోమని చైనా తెలిపింది. దీంతో ఐక్యరాజ్య సమితి వేదికలపై కాశ్మీరు అంశాన్ని లేవనెత్తేందుకు పాకిస్థాన్ ఇటీవల చేసిన ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగింది.

చరిత్ర వదిలేసిన సమస్య
చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి లూ కాంగ్ మాట్లాడారు. కాశ్మీరు సమస్యపై చైనా వైఖరి సుస్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. కాశ్మీరు సమస్య అనేది చరిత్ర వదిలేసిన సమస్య అన్నారు.

మీరు చర్చించుకోండి
భారతదేశం, పాకిస్థాన్ పరస్పరం చర్చలు జరుపుకోవాలని, సంబంధిత సమస్యలను సరైన రీతిలో పరిష్కరించుకోవాలని, శాంతి, సుస్థిరతలను కాపాడుకోవాలని తెలిపారు.

ప్రశ్నించగా అలా స్పందించారు
కాశ్మీర్ పైన ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమలు చేయాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులుగా లూ కాంగ్ ఇలా స్పందించారు.












Click it and Unblock the Notifications