ఎంతకు తెగించార్రా.. భారత్ పై రూ. 14 లక్షల కోట్లతో చైనా డేంజరస్ ప్లాన్.. ఇదే జరిగితే..

డ్రాగన్ కంట్రీ చైనా అన్నంత పనీ చేసింది. భారత్ సరిహద్దులోని టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యామ్ నిర్మాణం ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గా నిలుస్తోంది. చైనాలోని అన్ని ప్రాంతాలు ఈ డ్యామ్ కారణంగా అభివృద్ధి చెందనున్నాయి. అయితే ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయితే భారత్ కు నీటి ప్రవాహం తగ్గిపోతుందని.. ఈశాన్య రాష్ట్రాల్లో జీవవైవిధ్యం దెబ్బతింటుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా మాత్రం ఈ డ్యామ్ నిర్మాణం చేసి తీరుతామని చెబుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ఎట్టకేలకు చైనా ప్రారంభించింది. దాదాపు రూ. 14 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది డ్రాగన్ కంట్రీ. తాజాగా ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనట్లు చైనా ప్రధాని లీ కియాంగ్‌ తెలిపారు. టిబెట్‌ ప్రాంతంలోని బ్రహ్మపుత్ర నదిపైన చైనా ఈ వివాదాస్పద ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఓ వైపు ఈ ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలంటూ భారత్‌, బంగ్లాదేశ్‌ లు ఆందోళన చేస్తున్నా డ్రాగన్‌ మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదు.

భారత్, చైనా సరిహద్దు దేశాలు.. భారత్ లోని ఐదు రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. అలాగే భారత్, చైనా మధ్య దాదాపు 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ క్రమంలో చైనా భారత్ పై ఇలా ప్రాజెక్ట్ నిర్మాణంతో బిగ్ స్కెచ్ వేసింది. ఈ డ్యామ్ కారణంగా సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో నీటి సమస్య పెరిగే అవకాశం ఉందని.. ఈ రాష్ట్రాల్లోని పర్యావరణం, కమ్యూనిటీలకు ప్రమాదం పొంచి ఉందని పలువురు సాంకేతిక నిపుణులు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవల భారత్ పై చైనా కుట్ర విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండు ఖండించారు. భారత్ సరిహద్దులోని యార్లాంగ్ సాంగ్ పో నదిపై చైనా అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోందని.. ఇది భారత్ పై చైనా వాటర్ బాంబ్ గా అభివర్ణించారు. చైనా మిలిటరీ కన్నా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మరింత డేంజర్ అని పెమా ఖాండు వార్నింగ్ ఇచ్చారు. అటు భారత విదేశాంగ శాఖ సైతం చైనా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది.

China Unveils World s Largest Hydropower Project Rs 14 Lakh Crore Mega Dam Launched

మరోవైపు ప్రధాని మోదీ ఆగస్టులో చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో మోదీ చర్చలు జరపనున్నారు. గతంలో లద్దాఖ్‌ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో రెండు దేశాల మధ్య సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో త్వరలో భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టులో జరిగే SCO సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 31,సెప్టెంబరు 1 తేదీల్లో తియాంజిన్‌ వేదికగా SCO సదస్సు జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+