వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాతో చైనా మాటల యుద్ధం: ఘాటుగా వార్నింగ్: ఎప్పుడేం జరుగుతుందో..?

|
Google Oneindia TeluguNews

బీజింగ్: అగ్రరాజ్యం అమెరికాతో చైనా మాటల యుద్ధానికి తెర తీసింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది. హెచ్చరికలనూ జారీ చేసింది. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనిపై అమెరికా కూడా అంతే ఘాటుగా స్పందించింది. వైట్‌హౌస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టయింది.

vastu tips: ఈ మూడుతప్పులు చేస్తే ఎంత సంపాదించినా బూడిదలో పోసినట్టే.. ఇప్పుడే సరిదిద్దుకోండిvastu tips: ఈ మూడుతప్పులు చేస్తే ఎంత సంపాదించినా బూడిదలో పోసినట్టే.. ఇప్పుడే సరిదిద్దుకోండి

మొన్నటివరకు భారత్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న డ్రాగన్ కంట్రీ..తాజాగా అమెరికాను రెచ్చగొట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిస్తూ ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి దారి తీసిన చైనా.. ఆ తరువాత సిక్కిం సమీపంలోని డోక్లామ్‌పై కన్ను వేసిన విషయం తెలిసిందే. సరిహద్దులకు సమీపంలో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించి.. ఉద్రిక్తతకు కారణమైంది.

China warned US: Bear the consequences if House Speaker Nancy Pelosi visits Taiwan

ఇప్పుడు తాజాగా అమెరికానూ రెచ్చగొట్టింది. దీనికి ప్రధాన కారణం- అమెరికా చట్టసభల స్పీకర్ న్యాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనకు పూనుకోవడమే. ఈ వారంలో ఆమె తైవాన్ పర్యటన చేపట్టాల్సి ఉంది. దీనిపై చైనా స్పందించింది. న్యాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించాల్సి వస్తే అమెరికా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లీజియన్ హెచ్చరించారు.

తైవాన్‌ను సందర్శించాలనుకోవడం ఆ దేశ అంతర్గత విషయం కాదని, అది చైనాకు సంబంధించినదని అన్నారు. తమ హెచ్చరికలను పక్కన పెట్టి న్యాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు వస్తే.. దానికి తగిన మూల్యం తప్పదని స్పష్టం చేశారు. తైవాన్‌ను తమ దేశ అంతర్భాగంగా భావిస్తోంది చైనా. అమెరికా ప్రభుత్వ ప్రతినిధులెవ్వరూ ఈ మధ్యకాలంలో తైవాన్‌లో పర్యటించలేదు. ఇప్పుడు ఏకంగా స్పీకర్ ఆ దేశ సందర్శనకు రావాలని నిర్ణయించుకోవడాన్ని చైనా తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

English summary
China warned US that that Washington would bear the consequences, if US House Speaker Nancy Pelosi visits Taiwan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X