Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోమ్ లో చైనా, యూఎస్ ప్రతినిధుల భేటీపై ఆసక్తి: రష్యా విషయంలో యూఎస్ వార్నింగ్ ఇస్తుందా?

ఉక్రెయిన్‌లో యుద్ధానికి సైనిక మరియు ఆర్థిక సహాయం కోసం చైనాను రష్యా కోరిందని అమెరికా ఆరోపణలు గుప్పించిన తర్వాత చైనా ప్రతినిధులతో యూఎస్ ప్రతినిధులు భేటీ ఆసక్తికరంగా మారింది. తాజాగా ఉక్రెయిన్ పై భీకర యుద్ధం చేస్తున్న రష్యాకు చైనా సహాయం పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ తాజాగా చైనా, యూఎస్ ప్రతినిధుల భేటీలో ఏం జరగబోతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది..

 కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్

కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఉక్రెయిన్లోని పలు నగరాలు బాంబులు, క్షిపణుల దాడులతో భయానక వాతావరణానికి కేంద్రంగా మారాయి. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై రష్యా దాడిని అడ్డుకోవడం కోసం ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆంక్షలు విధించినప్పటికీ రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉక్రెయిన్ పై దాడిని కొనసాగిస్తూనే ఉంది.

చైనా సహాయం కోరిన రష్యా... యూఎస్ ఆరోపణ

చైనా సహాయం కోరిన రష్యా... యూఎస్ ఆరోపణ


ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యా మరింత ముందుకు వెళ్లడం కోసం ఇటీవల చైనా సహాయాన్ని కోరినట్లుగా అమెరికా ఆరోపించింది. రష్యా సైనిక పరికరాలు ఆయుధాలు ఇవ్వాలని చైనాను కోరినట్లుగా అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఆరోపణలు చేసినట్టు సమాచారం. ఉక్రెయిన్‌లో తన యుద్ధానికి సైనిక మరియు ఆర్థిక సహాయం కోసం రష్యా చైనాను కోరినట్లు ఈరోజు తెల్లవారుజామున అమెరికా అధికారులు మీడియాకు తెలిపారని సమాచారం.

యూఎస్ ఆరోపణలను ఖండించిన చైనా

యూఎస్ ఆరోపణలను ఖండించిన చైనా

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, ఉక్రెయిన్ సమస్యపై అమెరికా చైనాను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. బీజింగ్‌లో సాధారణ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. అయితే తమ నుంచి రష్యా ఎటువంటి సహాయము కోరలేదని, ఉక్రెయిన్ లో ప్రస్తుతం తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని వెల్లడించిన చైనా ఉద్రిక్తతలు మరింత తీవ్రం కాకుండా అడ్డుకోవడమే చైనా ముందున్న ప్రధాన కర్తవ్యమని పేర్కొంది.

రష్యాకు సాయం చేస్తే తీవ్ర పరిణామాలు : యూఎస్ వార్నింగ్

రష్యాకు సాయం చేస్తే తీవ్ర పరిణామాలు : యూఎస్ వార్నింగ్


రష్యా కు సహాయం చేస్తే తర్వాత కచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే చైనాను నేరుగా వ్యక్తిగతంగా హెచ్చరించామని అమెరికా పేర్కొంది. ఈ విషయంలో చైనా ముందుకు వెళ్లడాన్ని తాము అంగీకరించబోమని, ఈ సమయంలో ఏ దేశమైనా రష్యాకు అండగా నిలుస్తాం అంటే తాము సహించబోమని యూఎస్ వెల్లడించింది. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా చైనా ప్రతినిధులు సోమవారం రోమ్ లో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Recommended Video

    Russia-Ukraine Crisis: America దీటుగా స్పందించాలి Jo Biden పిరికోడు - Donald Trump| Oneindia Telugu
    రెండు దేశాల ప్రతినిధుల భేటీపై ఆసక్తి

    రెండు దేశాల ప్రతినిధుల భేటీపై ఆసక్తి


    రోమ్ లో భేటీ అయ్యే అమెరికా చైనా ప్రతినిధులు యుద్ధంపై రష్యా చేస్తున్న ప్రచారం, ఆదేశం పై ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలు వంటి అనేక అంశాలపై చర్చించనున్నారు. రష్యాకు సాయం చేస్తే మాత్రం చైనా ఆర్ధిక పరంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని, భారీ పెనాల్టీలు తప్పవని ఈ సమావేశంలో చైనాకు యూఎస్ వార్నింగ్ ఇవ్వనున్నట్టు సమాచారం.ఇప్పటికే చైనా విషయంలో యూఎస్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో ఇరు దేశాల ప్రతినిధుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+