వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరదాగా టూర్‌కు తీసుకెళ్లిన బాస్, 'సింహం'గా గిన్నిస్ రికార్డ్‌తో థ్యాంక్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: చైనాకు చెందిన ఓ యజమాని తన వద్ద పని చేస్తున్న 6,400 మందిని నాలుగు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు తీసుకు వెళ్లాడు. అది ప్రపంచ రికార్డ్ సృష్టించేందుకు కారణమైంది. ఉద్యోగులకు సరదా కోసం బాస్ పర్యటనకు తీసుకు వెళ్లగా, ఉద్యోగులు మానవహారంతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పి అతనికి కృతజ్ఞత తెలిపారు.

లీ జిన్‌ యువాన్‌ అనే వ్యక్తి చైనాలోని టియన్స్‌ గ్రూప్‌ అధినేత. చైనా సంప్రదాయ మందులు, వైద్యపరికరాల తయారీతో పాటు ఫైనాన్స్‌, టూరిజం, ఈ-బిజినెస్‌ తదితర రంగాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చైనాలో మొత్తం 12,000 మంది ఉద్యోగులున్న ఈ సంస్థ ఇటీవలే 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థలోని సగానికి పైగా ఉద్యోగులను యజమాని లీ ఫ్రాన్స్‌కు హాలీడే ట్రిప్‌గా తీసుకెళ్లారు. వారి కోసం మన కరెన్సీలో అక్షరాలా రూ.236 కోట్లు ఖర్చు పెట్టారు. సంస్థ వార్షికాదాయంలో ఇది దాదాపు సగం.

Chinese CEO takes 6400 of staff on 4-day holiday to France

ఉద్యోగులు ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌, కేన్స్‌, మొనాకో, తదితర అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సందర్శించేందుకు ప్యారీస్‌లో 140 హోటళ్లను, కేన్స్, మొనాకోల్లోనూ 4760 గదులను బుక్‌ చేశారు. ఈ గదులను 79 ఫోర్, పైవ్ స్టార్ హోటళ్లలో బుక్ చేశాడు.146 బస్సులను పెట్టాడు.

యజమాని అందించిన ఘనమైన కానుకకు దీటుగా ఉద్యోగులు తమ కృతజ్ఞత చాటుకున్నారు. టియన్స్‌ డ్రీమ్‌ ఈజ్‌ నైస్ అని అర్థం వచ్చేలా భారీ మానవహారంగా ఏర్పడి గిన్నీస్‌ రికార్డ్‌ సృష్టించారు. టియన్స్‌ అంటే చైనా భాషలో సింహం అని అర్థం.

English summary
A Chinese boss has taken 6,400 of his staff on a four day holiday to France that finished with a world-record breaking human chain in the Cote D'Azur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X