వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్‌కు జన్మనిచ్చి జనం మీదికి వదిలిన వుహాన్ సిటీ..ఇప్పుడెలా ఉందో తెలుసా?: అసలు కిక్కు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: వుహాన్ సిటీ.. 2020లో దీని పేరు తెలియని వారు బహుశా ప్రపంచం మొత్తం ఎవరూ ఉండకపోవచ్చు. గత ఏడాది మొత్తానికీ కరోనా వైరస్ అనేది ఎంత పాపులర్ అయిందో దానిక ధీటుగా అదే స్థాయిలో జనం నోళ్లల్లో బాగా నానిపోయిన పేరు ఇది. చైనాలోని హ్యూబే ప్రావిన్స్‌లో ఉండే ఆ వుహాన్ సిటీలోనే కరోనా వైరస్ పురుడుపోసుకున్నట్లుగా భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు. దీన్ని చైనా పాలకులు తోసిపుచ్చుతున్నప్పటికీ.. ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. వుహాన్ సిటీని.. కరోనా వైరస్ ఎపిసెంటర్‌గా భావిస్తున్నారు. అలాంటి చోట న్యూ ఇయర్ 2021 వేడుకలు జోరుగా సాగాయి.

Recommended Video

#Welcome2021 కరోనా పుట్టినిల్లు వుహాన్ సిటీలో ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీ మోడ్..!

కరోనా వైరస్ సోకుతుందనే భయం లేదు. మాస్కులను ధరించి కనిపించినప్పటికీ.. భౌతిక దూరాన్ని ఏ మాత్రం పాటించలేదు. ఫుల్ జోష్‌లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు వుహాన్ ప్రజలు. అర్ధరాత్రి వరకూ రోడ్ల మీదే షికారు చేశారు. బైక్‌లు, కార్లల్లో తిరుగుతూ పరస్పరం ఆలింగనం చేసుకుంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకోవడం కనిపించింది. వుహాన్‌లోని ప్రముఖ పర్యాటక, వాణిజ్య కేంద్రాల్లో ఒకటైన హాన్‌కౌ కస్టమ్స్ బిల్డింగ్ వద్దకు చేరుకున్న వందలాదిమంది వుహానీయులు కొత్త ఏడాది వేడుకల్లో మునిగితేలారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.

Chinese City Wuhan, once world’s COVID-19 epicenter, celebrates 2021 with large crowds

పోలీసులు విధించిన ఆంక్షలను వారు ఏ మాత్రం ఖాతరు చేయలేదు. మాస్కులను ధరించడం తప్పనిసరి అని, భౌతిక దూరాన్ని పాటించాలంటూ పోలీసులు చేసిన సూచనలను పట్టించుకోలేదు. పోలీసుల అభ్యంతరాలను లెక్క చేయలేదు. మైక్‌ల ద్వారా పోలీసులు చేసిన ప్రకటనలను చెవికెక్కించుకోలేదు. లవ్ సింబల్‌ గల బెలూన్లను గాల్లోకి ఎగరేస్తూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. మరోవంక- భారత్‌, బ్రిటన్ వంటి కొన్ని దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలను ప్రభుత్వాలు నిషేధించాయి. అర్ధరాత్రి వేళ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడంపై ఆంక్షలను విధించాయి.

జనం బయట తిరగకుండా 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలను కొనసాగింపజేశాయి. అదే కరోనా వైరస్‌కు జన్మనిచ్చిన వుహాన్ మాత్రం రాత్రంతా కొత్త ఏడాది వేడుకల్లో మునిగి తేలడం విమర్శలకు దారి తీస్తోంది. ఇంత భయానక వైరస్‌ వ్యాప్తి చెందడానికి కారణమైనప్పటికీ.. వారిలో పశ్చాత్తాపం కనిపించట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.

English summary
The Chinese city of Wuhan once the world’s epicenter of the COIVD-19 outbreak saw large crowds taking to the streets to ring in the new year. Photos of the celebrations show some revelers wearing masks and little to no social distancing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X