చైనా కొత్త అధ్యక్షుడెవరు - రెండు దశాబ్దాల అజెండా ఖరారు

బీజింగ్: ఆసియా దేశాల్లో అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోన్న చైనాకు కొత్త అధ్యక్షుడు రాబోతోన్నాడా?.. ఈ దిశగా అక్కడ అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ కీలక నిర్ణయాలను తీసుకోబోతోందా?.. త్వరలో నిర్వహించబోయే ప్లీనరీ అజెండా ఏంటీ?- ప్రస్తుతం ఈ డ్రాగన్ కంట్రీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తోంటే ఈ ప్రశ్నలు ఉత్పన్నం కావడం ఖాయం. రాజ్యాంగాన్ని సవరించే అవకాశాలు కూడా లేకపోవని తెలుస్తోంది.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ- ఈ నెల 16వ తేదీన అతిపెద్ద ప్లీనరీని నిర్వహించబోతోంది. దీనికి అవసరమైన సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 300 మంది కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ నాయకులు, ప్రతినిధులు, సభ్యులు ఇందులో పాల్గొన్నారు. వారం రోజుల పాటు ఈ సన్నాహక సమావేశం కొనసాగే అవకాశం ఉంది. పార్టీ ప్లీనరీలో చర్చించాల్సిన అంశాలు, నాయకత్వ మార్పు, ఆర్థికం, రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలతో కూడిన అజెండాను ఖరారు చేయనున్నారు.

The Chinese Communist Party holds 19th Central Committee for an annual plenary session to approve the policies and draft amendments to the CPC’s Constitution.

వచ్చే రెండు దశాబ్దాల్లో చైనాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అజెండాను ఈ సన్నాహాక సమావేశంలో ఖరారు చేయనున్నారు కమ్యూనిస్టు నాయకులు. ప్రస్తుత అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్ మూడో విడత పరిపాలన ప్రారంభమైనందున పార్టీ, ప్రభుత్వంలో భారీ మార్పులను తీసుకురావడానికి చైనా కమ్యూనిస్టు నేతలు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
పార్టీ రాజ్యాంగానికి సంబంధించిన విధానాలు, ముసాయిదా సవరణలను ఆమోదించడం ఖాయమైంది.

20వ సెంట్రల్ కమిటీ కార్యవర్గ సభ్యులను ఈ ప్లీనరీ సందర్భంగా ఎన్నుకుంటారు. తదుపరి పొలిట్‌బ్యూరో సభ్యుల ఎన్నిక కూడా ఈ ప్లీనరీలోనే షెడ్యూల్ అయింది. దేశాధ్యక్షుడిగా గ్ఝి జిన్‌పింగ్‌ను కొనసాగిస్తూనే.. ఆయన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నట్లు చైనీస్ మీడియా అంచనా వేసింది. పార్టీ, ప్రభుత్వంలో పలు మార్పులు చోటు చేసుకునే దిశగా ప్లీనరీలో తీర్మానాలు ఆమోదం పొందుతాయని అభిప్రాయపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+