క్యాష్ మౌంటేన్: డబ్బును గుట్టలా పేర్చి, ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు బోనస్
బీజింగ్: గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల కంపెనీల యజమానులు తమ ఉద్యోగులకు కార్లు, ఇండ్లు, బైకులు బహుమతిగా ఇవ్వడాన్ని మనం చూశాం. ఒక్కో దీపావళి పండుగకు ఇలాంటి వార్తలు ఒకటి వింటున్నాం. చైనాలోను ఇలాంటిదే జరిగింది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బోనస్‌గా ఏకంగా ఒక్కొక్కరికి రూ.62 లక్షలు ఇచ్చారు.

క్యాష్ మౌంటేన్
చైనాలో న్యూ ఇయర్ ఫెస్టివెల్ జరుపుకుంటారు. ఈ ఫెస్టివెల్ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ఇస్తుంటాయి. ఈ నేపథ్యంలో నాన్‌చాంగ్ పట్టణానికి చెందిన ఓ స్టీల్ ప్లాంట్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన ఉద్యోగుల కోసం ఏకంగా 300 మిలియన్ యువాన్లు ఖర్చు చేసింది. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.34 కోట్లు.

ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు
ఈ మొత్తం డబ్బును కొండలా పేర్చి, ప్రదర్శించారు. కంపెనీలోని ఆఫీస్‌లో ప్రదర్శనగా ఉంచారు. ఈ కంపెనీలో దాదాపు ఐదువేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షల చొప్పున బోనస్‌లు అందించింది. దీనిపై ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావడం లేదన్నారు.

గతంలో పరిమిత సమయంలో తీసుకెళ్లినంత డబ్బు
గతంలో ఇదే కంపెనీ ఉద్యోగులకు బోనస్‌లు ఇచ్చింది. కంపెనీలోని ఓ హాల్లో డబ్బు కట్టలను గుట్టలుగా పోసింది. ఒక్కో ఉద్యోగికి పరిమిత సమయం ఇచ్చి ఆ టైంలో ఎంత డబ్బును తీసుకెళ్లగలిగితే అంత తీసుకు వెళ్లమని చెప్పి బోనస్‌గా ఇచ్చింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications