వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెస్లాకు పోటీగా ఎలక్ట్రిక్ కారు తీసుకొచ్చే ప్రయత్నాల్లో చైనా కంపెనీ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జీకర్ కారు

టెస్లా కారుకు పోటీగా చైనాలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ జీలీ ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసే ప్రణాళికల్లో ఉంది.

చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ అందుకోడానికి 'జీకర్' బ్రాండ్‌ కింద ఒక ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొస్తున్నామని ఈ కంపెనీ మార్చి 23న ప్రకటించింది. వోల్వో, లోటస్ బ్రాండ్లు జీలీ యాజమాన్యంలోనే ఉన్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'టెస్లా, బాస్ ఎలాన్ మస్క్ చైనాలో కార్బన్ ఉద్గారాల నియంత్రణ గురించి ఇంతకు ముందు ఒక ఆఫర్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చైనాలో తమ కార్ల గురించి ఉన్న ఆందోళనలను దూరం చేయడానికి ప్రయత్నించారు.

జీలీ కార్ ఎప్పటికి వస్తుంది

జీకర్ బ్రాండ్ కింద హై క్వాలిటీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తామని జీలీ సంస్థ చెప్పింది.

ఆ కంపెనీ వివరాల ప్రకారం, 2021 మూడో త్రైమాసికంలో ఈ కారును మొదటిసారి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

జీలీ కంపెనీ ఇప్పటికే చాలా బ్రాండ్ల కింద ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తోంది. వోల్వోలో యాజమాన్య హక్కులున్న ఈ కంపెనీ పోల్‌స్టార్ ఎలక్ట్రిక్ కార్ తయారు చేస్తోంది. హెడ్ క్వార్టర్ స్వీడన్‌లో ఉన్నప్పటికీ, ఈ కార్లు చైనాలో తయారవుతున్నాయి.

లోటస్ ఎవియా ఎలక్ట్రిక్ సూపర్ కార్

మరోవైపు జీలీ యాజమాన్యంలోని లోటస్ ప్రస్తుతం 'ఎవియా' పేరుతో ఎలక్ట్రిక్ సూపర్ కార్ తయారుచేసే పనిలో ఉంది.

జీలీ దగ్గర క్యాబ్ తయారు చేసే లండన్ ఈవీ కంపెనీ యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయి. అది ప్రస్తుతం ఒక హైబ్రీడ్ ట్యాక్సీ తయారు చేస్తోంది. ఈ టాక్సీ పెట్రోల్‌తోపాటూ బ్యాటరీతో కూడా నడుస్తుంది.

జీకర్ కారుకు టెస్లా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎందుకంటే, టెస్లా మోడల్-3 గత ఏడాది చైనాలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. దీనితోపాటూ చైనాలోని నియో, ఎక్స్‌ఫెంగ్, లీ ఆటో లాంటి మిగతా కంపెనీల నుంచి కూడా జీకర్‌కు పోటీ ఎదురవుతోంది. ఈ కంపెనీల కార్లు కూడా బాగా అమ్ముడవుతున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే తమ వోయా బ్రాండ్ ఈ ఏడాది జులై నుంచి చైనా మార్కెట్లో కార్ల విక్రయాలు ప్రారంభిస్తుందని గత వారం డోంగ్‌ఫెంగ్ మోటార్ చెప్పింది. డోంగ్‌ఫెంగ్ మోటార్ కంపెనీ జపాన్ నిసాన్, ఫ్రాన్స్‌లోని పూజో సిథోయెన్ జాయింట్ వెంచర్.

జీలీ యాజమాన్యంలో ఉన్న వోల్వో పోల్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు తయారు చేస్తోంది

ప్రస్తుతం చైనాపై జీలీ కన్ను

2025 నాటికి దేశంలో అమ్ముడయ్యే కార్లలో 20 శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉండాలని చైనా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జీలీ కంపెనీకి వోల్వో, లోటస్ బ్రాండ్స్‌తోపాటూ జీలీకి మెర్సిడెస్ బెంజ్ ఓనర్ డెమ్లర్‌ కంపెనీలో కూడా వాటాలు ఉన్నాయి.

మొదట చైనా మీద ఫోకస్ పెట్టాలని జీకర్ వ్యూహం సిద్ధం చేసింది. కానీ ప్రీమియం కార్ల డిమాండ్ గమనిస్తూ అది విదేశీ అవసరాలపై కూడా ఒక కన్నేసి ఉంచనుంది.

జీకర్ ప్రస్తుతం తూర్పు చైనా హెఫయీలో లింగ్లింగ్ టెక్నాలజీస్ పేరుతో ఒక కొత్త కంపెనీగా పనిచేస్తుంది.

"24 ఏళ్ల మా పాత కంపెనీ జీలీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చైర్మన్ షీఫూ అనుకుంటున్నారు. ఇక్కడ నియో, ఎక్స్‌ఫెగ్, లీ ఆటో లాంటి స్టార్టప్ వాతావరణం తీసుకురావాలని ఆయన ఆలోచిస్తున్నారు" అని ఆసియా మార్కెట్‌ను నిశితంగా గమనించే జోజోగో కన్సల్టెన్సీ సీఈఓ మైకెల్ డ్యూన్ అన్నారు.

దానికోసం కంపెనీ విడిగా లింగ్లింగ్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ కంపెనీని ప్రారంభించనుంది. ఇది జీలీ నుంచి స్వతంత్రంగా ఉంటూ పనిచేయనుంది.

అంతకు ముందు జీలీ కంపెనీ వార్షిక ఫలితాలను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం ఈ కంపెనీ 2020లో మొత్తం 13.2 లక్షల వాహనాలు విక్రయించింది. ఏడాది క్రితం ఆ సంఖ్య 13.6 లక్షలు ఉంది.

ఎలాన్ మస్క్ వీడియో కాన్ఫరెన్స్

చైనాలో ఎలాన్ మస్క్ ప్రచారం

టెస్లా యజమాని ఎలాన్ మస్క్ మార్చి 23న చైనా ప్రభుత్వ టీవీలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఇటీవల విడుదలైన చైనా ఐదేళ్ల ఆర్థిక ప్రణాళిక తనకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందన్న ఆయన, కర్బన ఉద్గారాలు తగ్గించాలని అందులో నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు అనువుగా ఉంటాయని భావించారు.

టెస్లా కార్లలోని కెమెరాల ద్వారా చైనాలోని డేటాను సేకరిస్తారేమో అనే ఆందోళనలో ఉన్న చైనా ప్రభుత్వం సైన్యంలో, కీలక ప్రభుత్వ సిబ్బంది టెస్లా కార్లు ఉపయోగించకుండా నిషేధించింది.

దీంతో, కొందరు చైనా నేతలు, పారిశ్రామిక వేత్తలతో ఎలాన్ మస్క్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

చైనా లేక వేరే ఏ దేశం నుంచి అయినా టెస్లా కార్ల ద్వారా సేకరించిన డేటాను తాము అమెరికా ప్రభుత్వంతో ఎప్పటికీ షేర్ చేసుకోమని భరోసా ఇచ్చారు.

టెస్లా ప్రపంచ ఆదాయం 31.5 బిలియన్ కోట్ల డాలర్లు. ఇందులో చైనా నుంచి వచ్చే ఆదాయం కనీసం 20 శాతం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Chinese company in an attempt to bring an electric car to compete with Tesla
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X