మోదీకి చైనా జేజేలు.. మాతో పెట్టుకోలేరు.. గాల్వాన్‌పై ప్రధాని ప్రకటన భేష్.. పాక్ అయ్యింటే వేరే సీన్..
నోటితో పొగుడుతూ, నొసటితో వెక్కిరించడం బాగా అలవాటైన చైనా.. భారత ప్రధాని నరేంద్ర మోదీపైనా అదే స్ట్రాటజీ అనుసరిస్తున్నది. ''భారత భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఏ ఒక్క భారతీయ పోస్టునూ కైవసం చేసుకోలేదు. ఒక్క అంగుళం కూడా ఇతరుల స్వాధీనం కాలేదు'' అంటూ సరిహద్దు గొడవలపై మోదీ చేసిన ప్రకటనను చైనా స్వాగతించింది. అదే సమయంలో.. చైనాను ఢీకొనే సత్తా లేదని తెలుసు కాబట్టే మోదీ ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారంటూ విషం కక్కింది.
Recommended Video

గ్లోబల్ టైమ్స్ కథనాలు..
చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని ‘గ్లోబల్ టైమ్స్' పత్రికకు అధ్యక్షుడు జిన్ పింగ్ ఆలోచనలకు అక్షర రూపమిచ్చే సాధనమని ప్రపంచానికి తెలిసిందే. గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘటనను తక్కువ చేసి చూపించడం ద్వారా ఉద్రిక్తతల్ని నివారించేందుకు భారత ప్రధాని ప్రయత్నిస్తున్నారని, సొంత దేశంలో జాతీయవాదుల నుంచి విపరీతమైన ఒత్తిడి ఎదురవుతున్నా, ఆయన సంయమనం పాటిస్తుండటం గొప్ప విషయమని చైనా అధికారిక మీడియా పేర్కొంది. మోదీ ప్రకటన ద్వారా చైనా ఏ తప్పూ చేయలేదని స్పష్టమైనట్లు వ్యాఖ్యానించింది.

సైన్యానికి స్వేచ్ఛ అందుకే..
గాల్వాన్ లోయలో హింస తర్వాత.. సరిహద్దు వెంబడి చైనాను ఎదుర్కొనే విషయంలో ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లుగా వచ్చిన వార్తలపై, ఇండియా వ్యాప్తంగా కొనసాగుతోన్న యాంటీ చైనా ప్రచారంపైనా ‘గ్లోబల్ టైమ్స్' స్పందించింది. సైనికుల్లో నైతికబలం పెంచేందుకు మాత్రమే స్వేచ్ఛ ఇస్తున్నట్లు మోదీ సర్కార్ ప్రకటన చేసిందని, చైనాతో వివాదం ఇంకా పెరగొద్దన్న ఉద్దేశంతోనే మోదీ.. జాతీయవాదులు చేస్తోన్న చైనా వ్యతిరేక ప్రచారాన్ని చల్లబర్చేందుకు ప్రయత్నిస్తున్నారని పత్రికలో రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా.. విశ్లేషకుల అభిప్రాయాల పేరిట ఇండియాను అవమానిస్తూ రాతల్లో గాఢతను పెంచారిలా..

పాకిస్తాన్ అయి ఉంటే..
చైనా సరిహద్దులో వివాదాన్ని చల్లబర్చేందుకు ప్రయత్నిస్తోన్న మోదీ సర్కారు.. ఇలాంటి సందర్భమే పాకిస్తాన్ సరిహద్దులో తలెత్తి ఉంటే మరోలా స్పందించి ఉండేదని, చైనా విషయంలో మౌనంగా ఉండిపోయిన అధికారపార్టీ, రైట్ వింగ్ గ్రూపులన్నీ.. పాకిస్తాన్ విషయంలో మాత్రం రెచ్చిపోయి ఉండేవని ‘గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. ‘‘చైనా విషయంలో మోదీ ప్రభుత్వం చేస్తున్నదంతా వట్టి ప్రచారమే. మాజీ ఆర్మీ చీఫ్, ప్రస్తుత కేంద్ర మంత్రి వీకే సింగ్ లాంటి వాళ్లతో ‘చైనా సైనికులు 40 మంది చనిపోయారు'అని చెప్పడం కూడా ప్రచారంలో భాగమే. ఇవి స్వదేశంలో ఉద్రిక్తతలు నివారించడానికి, సైన్యానికి నైతిక బలం చేకూర్చేందకు మాత్రమే పనికొస్తాయి''అని ఓ డిఫెన్స్ నిపుణుడు చెప్పిన అభిప్రాయాన్ని కమ్యూనిస్టు పత్రిక హైలైట్ చేసింది.

యుద్ధం చేసే సత్తా లేదు..
ఇప్పటికిప్పుడు చైనాతో యుద్ధం చేసే సత్తా ఇండియాకు లేదని, ఆ విషయం ప్రధాని నరేంద్ర మోదీ కంటే స్పష్టంగా ఎవరికీ తెలియదని, కాబట్టే ఆయన పరిస్థితులు మరింత దిగజారిపోకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారని చైనా అధికారిక మీడియా పేర్కొంది. ‘‘హిందూత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లడమే పనిగా బీజేపీ.. జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేసింది. తద్వారా పాకిస్తాన్ ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ఇటువైపు చైనా భూభాగాలను కూడా లదాక్ లోనివేనని పేర్కొంటూ దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించుకున్నారు''అని చైనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కు చెందిన మరో ప్రముఖుడి అభిప్రాయాన్ని పత్రికలో పొందుపర్చారు.

ఘోర అవమానం తప్పదు..
పరిస్థితుల్ని అదుపుచేసేందుకు ప్రధాని మోదీ చేస్తోన్న ప్రయత్నాలు విఫలమై, ఒకవేళ దుందుడుకు నిర్ణయంగానీ తీసుకుంటే.. అది ఇండియాకే నష్టమని, ప్రస్తుతం ఏ రకంగా చూసినా చైనాతో పోటీ పడగలిగే స్థాయిలో ఇండియా లేదని, అయినాసరే ముందుకొస్తే.. 1962 కంటే ఘోరమైన అవమానాన్ని చవి చూడాల్సి వస్తుందని చైనా పాలకుల మాటగా ‘గ్లోబల్ టైమ్స్' హెచ్చరించింది. మోదీ తాజా వ్యాఖ్యలకుతోడు ఎల్ఏసీ గురించి 2018లో చేసిన కామెంట్లను సైతం చైనా హైలైట్ చేసింది. ‘‘వాస్తవ నియంత్రణ రేఖ గురించి భిన్నమైన అవగాహనల కారణంగానే సరిహద్దుల్లో అప్పుడప్పుడూ కొన్ని ఘటనలు జరుగుతూంటాయి'' అని గతంలో మోదీ చెప్పిన మాటలు అక్షర సత్యాలని, ఆ మాటకు భారత్ కూడా కట్టుబడే ఉంటుందని చైనా ఆశిస్తున్నట్లు కథనాన్ని ముగించారు.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications