కరోనా విలయం: చైనా సానుభూతి -ప్రధాని మోదీకి జిన్‌పింగ్ కీలక సందేశం -భారత్‌కు సహకారం
భారత్ లో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ఉధృతంగా సాగుతోన్న దరిమిలా ప్రపంచ దేశాలన్నీ ఆపన్నహస్తం అందిస్తున్నాయి. కరోనా పుట్టిల్లయిన చైనా సైతం తాజాగా భారత్ కు మద్దతుగా నిలిచింది. కరోనా మహమ్మారితో పోరాటానికి భారత్ తో కలిసివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది.
కొవిడ్-19 సెకండ్ వేవ్ భారత్ ను వణికిస్తున్న నేపథ్యంలో అన్ని విధాలా ఆపన్న హస్తం అందిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. భారత్ లో కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో ఉత్పన్నమైన పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందని, చైనీయుల పక్షాన..తాను సైతం సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం, ప్రజల పట్ల సానుభూతి కనబరుస్తున్నామని లేఖలో జిన్‌పింగ్ పేర్కొన్నారు.

కోవిడ్ మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటానికి తమ వంతు సహకారం ఉంటుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. ప్రజలు పరస్పర సహకారంతోనే భవిష్యత్ నిర్మించుకుంటామని, సహకారంతోనే ప్రపంచ దేశాలు మహమ్మారిని మట్టికరిపిస్తాయని ఆయన అన్నారు. కోవిడ్ నుంచి ఇండియాను గట్టెక్కించేందుకు చైనా ముందుకు రావడం హర్షనీయమని నెటిజెన్లు అంటున్నారు.
కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని చుట్టేసిన విషయం తెలిసిందే. అయితే కరోనాను చైనా చాలా చాకచక్యంగా అధిగమించింది. కానీ అమెరికా, బ్రిటన్, బ్రిజిల్ సహా ఇండియా కోవిడ్ కౌగిళిలో బిగుసుకుపోయాయి. ప్రభుత్వం అప్రమత్తం అయ్యేలోపే విస్తృతంగా వ్యాపించింది. భారత్ లో రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్త కేసులు నాలుగు లక్షలకు చేరువగా, మరణాలు 4వేలకు దగ్గరగా నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications