పాకిస్థాన్‌లో అంతర్యుద్ధం: 12 నగరాలపై ఏకకాలంలో బాంబుల వర్షం!
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలవ్వగా.. ఇప్పుడు బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో చెలరేగిన హింస ఆ దేశాన్ని మరింత కలవరపెడుతోంది. శనివారం(జనవరి 31) తెల్లవారుజామున బలోచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) 'ఆపరేషన్ హేరాఫ్' రెండో దశలో భాగంగా ఏకకాలంలో 12 నగరాలపై దాడులు చేసింది. క్వెట్టా, గ్వాదర్, చమన్, మస్తుంగ్, నుష్కీ వంటి ప్రధాన నగరాల్లోని పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
ఎలా మొదలైందంటే?
శనివారం ఉదయం 6 గంటల సమయంలో క్వెట్టాలోని సరియాబ్ రోడ్డులో పోలీస్ వాహనంపై బాంబు దాడి, కాల్పులతో ఈ హింస ప్రారంభమైంది. మస్తుంగ్‌లో పోలీస్ స్టేషన్‌ను తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న 30 మందికి పైగా ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం. నుష్కీలోని సీటీడీ (CTD) కార్యాలయంపై జరిగిన దాడిలో 8 మంది భద్రతా సిబ్బంది మరణించారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్ బషీర్ జెబ్ బలోచ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ.. బలోచ్ ప్రజలందరూ ఈ తిరుగుబాటులో చేరాలని పిలుపునిచ్చారు. "చరిత్ర రాయాలంటే ప్రాణాలు ఇవ్వాలి లేదా తీసుకోవాలి" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

పాక్ సైన్యం ఎదురుకాల్పులు
పాకిస్థాన్ అధికారిక వర్గాల ప్రకారం.. ఈ దాడుల్లో ఇప్పటివరకు 10 మంది భద్రతా సిబ్బంది మరణించగా.. ఎదురుకాల్పుల్లో సుమారు 37 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారు. గడిచిన 48 గంటల్లో మొత్తం 70 మందికి పైగా తిరుగుబాటుదారులను చంపినట్లు సైన్యం ప్రకటించింది. బెలూచిస్థాన్ అంతటా మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు. ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
#Thread
— Shivank Mishra (@shivank_8mishra) January 31, 2026
Balochistan Under Siege: BLA Offensive Across Balochistan Exposes Pakistan’s Crumbling Control; 12 Soldiers, 7 Policemen Killed
Balochistan descended into what increasingly resembles a full-scale internal war on Saturday after the Baloch Liberation Army (BLA) launched… pic.twitter.com/GT6T219jmv
ఎందుకీ పోరాటం?
బెలూచిస్థాన్‌ను పాకిస్థాన్ నుంచి విడదీసి స్వతంత్ర దేశంగా మార్చాలని బలోచ్ లిబరేషన్ ఆర్మీ దశాబ్దాలుగా పోరాడుతోంది. తమ ప్రాంతంలోని సహజ వనరులను (ముఖ్యంగా చైనా సహకారంతో చేపట్టిన సీపెక్ ప్రాజెక్టుల ద్వారా) పాక్ ప్రభుత్వం దోచుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు. పాకిస్థాన్, అమెరికా, బ్రిటన్ దేశాలు బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ప్రస్తుతం గ్వాదర్, క్వెట్టా వంటి నగరాల్లో 'క్లియరెన్స్ ఆపరేషన్' కొనసాగుతోంది. పాక్ సైన్యం అనేక పోస్టులను వదిలి వెనక్కి తగ్గుతున్నట్లు వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే ఉంది.
-
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications