ఇళ్లపైకి దూసుకెళ్లిన విమానం: ఏడుగురు మృతి
కిన్షాసా: విమానాశ్రయంలో రన్‌వేపై దిగే సమయంలో ఓ విమానం అదుపుతప్పి పక్కనే ఉన్న నివాసాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగింది.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వీసెస్ ఎయిర్ కంపెనీకి చెందిన ఓ కార్గో జెట్ విమానం ముజి-మయిలోని విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా.. అదుపుతప్పి ఎయిర్‌పోర్టు పక్కనే ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది.

దీంతో ఇళ్లలో ఉన్న ఏడుగురు స్థానికులు మృతిచెందారు. ఇళ్లు కూడా చాలావరకు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ముజీ-మయిలోని ఎయిర్‌పోర్టులో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇప్పటికే కాంగో ఎయిర్‌వేస్ గత కొద్ది రోజుల నుంచి తమ సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications