కరోనాపై సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్.. వైరస్ ఇప్పట్లో తగ్గదు.. సీజనల్ ఇన్‌ఫెక్షన్‌లా మళ్లీ వస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా పాతిక దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి.. మంగళవారం నాటికి 3,100 మందిని బలితీసుకుంది. చైనా తర్వాత అత్యధికంగా సౌత్ కొరియాలో కేసులు బయటపడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఆరుగురు మరణించారు. ఇక ఇండియాలో నెల రోజుల కిందటే తొలి కేసు నమోదైనప్పటికీ ఇప్పటిదాకా ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తలేదు. హైదరాబాద్, ఢిల్లీల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడం, తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో ఏడుగురూ ఎఫెక్ట్ అయ్యారని తేలడంతో భయాందోళనలు రెట్టింపయ్యాయి. ఇది చాలదన్నట్లు వైరస్ కు సంబంధించి సైంటిస్టులు మరో షాకింగ్ విషయం బయటపెట్టారు..
రెండు నెలల కిందట చైనాలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి కరోనా వైరస్ కు మందు కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా సైంటిస్టులు కృషి చేస్తూనే ఉన్నారు. అణువణువూ శోధిస్తున్నప్పటికీ కొవిడ్19(కరోనా వైరస్)ను ఎలా అరికట్టాలనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే వ్యాధికి సంబంధించిన అనేక కొత్త విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. జలుబు, దగ్గుతో మొదలై, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏర్పడటం కరోనా లక్షణం. సాధారణ సీజనల్ వ్యాధుల్లోనూ మనకు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. మరింత పరిశోధన తర్వాత సైంటిస్టులు ఏం చెప్పారంటే..

లండన్‌కు చెందిన ప్రఖ్యాత క్వీన్ మేరీ వర్సిటీ సైంటిస్టుల బృందం కొంతకాలంగా కొవిడ్19(కరోనా వైరస్)పై భారీ ప్రయోగాలు చేస్తున్నది. కరోనాలో సీజనల్ వ్యాధుల లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, అది ఇప్పటికిప్పుడు తగ్గిపోయే లేదా అంతమైపోయే వైరస్ కాదని సైంటిస్టులు చెప్పరు. ''ఇప్పటికిప్పుడు వచ్చిపోయే ఉపద్రవం కాదిది. సీజనల్ ఇన్‌ఫెక్షన్ లాగా మళ్లీ మళ్లీ విజృంభించే అవకాశాలు చాలా ఉన్నాయి''అని తెలిపారు.
కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోతుందని ఇప్పుడే చెప్పలేమని, గత 50 ఏళ్లుగా అందరికీ తెలిసన ఇతర వైరస్ ల లాగానే.. సీజనల్ వైరస్ లాగా కరోనా మళ్లీ వచ్చే అవకాశముందని సైంటిస్టులు అన్నారు. జలుబు, ఫ్లూ జ్వరం, ఛాతిలో ఇన్‌ఫెక్షన్ లాగానే కరోనా కూడా ఎప్పటికీ ఉండిపోయే(శాశ్వత) వైరస్ అని చెప్పారు. క్వీన్ మేరీ వర్సిటీ సైంటిస్టులు చెప్పిన విషయాలను ప్రఖ్యాత డెయిలీ మెయిల్ ప్రచురించింది.












Click it and Unblock the Notifications