ఒక్క డిన్నర్ జీవితాన్నే మార్చేసింది.. రూ. 257 రూపాయిలతో కోటీశ్వరులైన జంట
ఒక సరదా డిన్నర్ డేట్ సాయంత్రం ఒక జంట జీవితాన్ని అమాంతం మార్చేసింది. కేవలం రూ. 257 (3 డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేసిన ఒక చిన్న లాటరీ టికెట్, వారిని ఏకంగా కోటీశ్వరులను చేసింది. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్న ఈ జంట, డిన్నర్‌కు వెళ్తుండగా, న్యూట్లీ పట్టణంలోని లక్కీ డేలీ 397 సెంటర్ స్ట్రీట్ వద్ద ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు.
నిజానికి ఆ టికెట్ కొనే విషయంలో వారిద్దరి మధ్య చిన్నపాటి వాదనే జరిగింది. ఒకరు వేరే చోట కొందామని, మరొకరు అక్కడే కొందామని పట్టుబట్టారు. చివరకు, 10 డాలర్ల టికెట్‌తో పాటు రెండు 3 డాలర్ల టికెట్లు కొనుగోలు చేశారు. మొదటి టికెట్‌ను స్క్రాచ్ చేయగానే వారి ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేవు. వారు ఊహించని విధంగా 1.5 మిలియన్ డాలర్లను గెలుచుకున్నారు.

ఈ జంటకు మొదట $875,200 నగదు బహుమతి లభించింది. అయితే, ఈ గేమ్‌లో టాప్-3 లాటరీ ప్రైజ్ మనీ గెలుపొందడంతో, వారు ఒకేసారి మొత్తం డబ్బును తీసుకోకుండా 'అన్యుటీ ఎంపిక' (Annuity Payment) పథకాన్ని ఎంచుకున్నారు. దీని ప్రకారం, వారు 25 సంవత్సరాల పాటు ఏడాదికి ఒకసారి చెల్లింపులు అందుకుంటారు. అంటే, 25 ఏళ్లు పూర్తయ్యేసరికి మొత్తం $1.5 మిలియన్లు వారి చేతికి అందుతుంది.












Click it and Unblock the Notifications