వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19: కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకునేందుకు ఎన్నాళ్లు పడుతుంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్-19

కరోనావైరస్ బాధితుల కోలుకోవడానికి ఎన్నాళ్లు పడుతుందన్న విషయం గురించి చెప్పాలంటే అది వారు ఏ మేరకు జబ్బు పడ్డారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది.

కొందరు చాలా త్వరగానే కోలుకుంటున్నారు. కానీ మరి కొందరి పరిస్థితి మాత్రం అందుకున్న భిన్నంగా ఉంటోంది. కోవిడ్-19 కారణంగా తలెత్తిన సమస్యలు దీర్ఘకాలం పాటు కొనసాగుతునే ఉన్నాయి.

వయసు, లింగ భేదం, ఇతర ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కోవిడ్-19 కారణంగా తలెత్తే సమస్యల్ని మరింత తీవ్రం చేస్తున్నాయి.

సాధారణంగా చికిత్స ఏ స్థాయిలో ఇస్తున్నారు, ఎంత కాలం ఇస్తున్నారన్న విషయాలపై రోగులు ఎంత కాలంలో కోలుకుంటున్నారన్న విషయం ఆధారపడి ఉంటుంది.

జ్వరం

నాకు తేలిక పాటి లక్షణాలు మాత్రమే ఉంటే ?

కోవిడ్-19 సోకిన వారిలో ప్రాథమికంగా దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాదు వారికి ఒళ్లు నొప్పులు, అలసట, గొంతు నొప్పి, తలనొప్పి కూడా ఉంటుంది.

మొదట్లో పొడి దగ్గు ఉంటుంది. కానీ కొంత మందికి కఫంతో కూడిన దగ్గు కూడా ఉండొచ్చు.

ఈ లక్షణాలున్నప్పుడు చికిత్సలో భాగంగా వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోమంటారు. ఎక్కువగా పోషక విలువలున్న ద్రవ పదార్థాలు ఇస్తారు. అలాగే నొప్పుల నివారణకు పారాసెటమాల్ ఇస్తారు.

దీంతో దగ్గు కొద్ది రోజులు కొనసాగినప్పటికీ వారం రోజుల్లోపే జ్వరం తగ్గుతుంది. డబ్ల్యూహెచ్ఓ చైనాలో జరిపిన అధ్యయనం ప్రకారం బాధితులు తిరిగి కోలుకునేందు కనీసం 2 వారాల సమయం పడుతుంది.

కొంత మందికి ఆక్సిజన్ థెరఫీ అందించేందుకు వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల్సి రావచ్చు.

నాలో మరింత తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే ?

కొంత మంది విషయంలో ఈ వ్యాధి మరింత తీవ్రంగా ఉండవచ్చు. సాధారణంగా 7-10 రోజుల పాటు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఉంటే ఈ పరిస్థితి తలెత్తుతుంది.

ఆ తర్వాత మార్పు ఒక్కసారిగా కనిపించవచ్చు. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఊపిరితిత్తుల్లో కఫం చేరుతుంది.

అప్పటికే శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడే ప్రయత్నం చేస్తుండటమే అందుకు కారణం.

అయితే ఈ ప్రయత్నంలో వ్యాధి నిరోధక వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. ఫలితంగా ఆరోగ్యం క్షీణిస్తుంది.

కొంత మందికి ఆక్సిజన్ థెరఫీ అందించేందుకు వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల్సి రావచ్చు.

“శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తగ్గేందుకు నిర్ణీత సమయం పట్టవచ్చు. అలాగే ఒళ్లంతా మంట పెడుతున్నట్టు అనిపిస్తుంది.” అని లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ జీపీ సారా జర్విస్ అన్నారు. ఈ పరిస్థితి నుంచి తిరిగి కోలుకునేందుకు 2 నుంచి 8 వారాలు పట్టవచ్చని ఆమె చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

నాకు ఇంటెన్సివ్ కేర్ అవసరమైతే ?

డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం కోవిడ్-19 సోకిన వారిలో ప్రతి 20 మందిలో ఒకరికి ఇన్సెంటివ్ కేర్ చికిత్స అవసరమవుతుంది.

సాధారణంగా ఐసీయూలో చేరితే అది ఎటువంటి జబ్బు అయినా సరే కోలుకొని తిరిగి ఇంటికెళ్లేందుకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించిన తర్వాత మాత్రమే రోగిని ఇంటికి పంపుతారు.

తీవ్రంగా జబ్బు పడినప్పుడు తిరిగి కోలుకునేందుకు 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని లండన్‌లోని ఇంటిన్సివ్ కేర్ మెడిసిన్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ అలిసన్ పిట్రాడ్ తెలిపారు.

దీర్ఘకాలం ఆస్పత్రిలో ఉండటం వల్ల కండరాలు క్షీణిస్తాయి. రోగులు నీరసించిపోతారు. కండరాలు తిరిగి బలం పుంజుకునేందుకు కొంత సమయం పడుతుంది. తిరిగి సజావుగా కొందరికి ఫిజియో థెరఫీ కూడా అవసరం కావచ్చు. ఐసీయూలో ఉన్నందువల్ల మానసిక ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు.

ఈ వైరస్ కారణంగా తలెత్తే ఆయాసం, అలసట కచ్చితంగా తీవ్ర ప్రభావం చూపించే అంశమేనని కర్డిఫ్ అండ్ వేల్ యూనివర్శిటీకి చెందిన క్రిటికల్ కేర్ సైకో థెరఫిస్ట్ పాల్ టోస్ అన్నారు.

చైనా, ఇటలీ దేశాల్లోని రోగులను పరిశీలిస్తే కొద్దిగా శ్రమ పడినా బాగా నీరసం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. అలాగే అదే పనిగా దగ్గుతోపాటు చాలా నిద్ర కూడా అవసరమవుతోందని అర్థమవుతోంది.

“రోగులు పూర్తిగా కోలుకునేందుకు కొన్ని నెలలు పడుతుందన్న విషయం మాకు తెలుసు.” అని పాల్ టోస్ చెప్పారు.

అలాగని ఈ విషయంలో అందర్నీ ఒకే గాటన కట్టలేం. కొందరు కొద్ది కాలం పాటు ఐసీయూలో ఉంటే సరిపోవచ్చు. మరి కొందరు వారాల కొద్దీ ఉండాల్సి రావచ్చు.

కరోనావైరస్ నా శరీరంపై దీర్ఘ కాలం ప్రభావం చూపుతుందా?

కచ్చితంగా చెప్పేందుకు ఇప్పటికైతే పూర్తి సమాచారం లేదు. కాని కొన్ని ఇతర అంశాలను మనం పరిశీంచవచ్చు.

రోగ నిరోధక వ్యవస్థ శక్తికి మించి పని చేయడం వల్ల అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రస్ సిండ్రోమ్ –అర్డ్స్ అంటే తీవ్రమైన శ్వాస కోశ సమస్యలు రోగిలో కనిపిస్తుంటాయి. ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.

ఐదేళ్ల తర్వాత కూడా రోగుల్లో శారీరక, మానసిక ఇబ్బందులు కొనసాగుతాయని డాక్టర్ టోస్ అభిప్రాయపడ్డారు.

ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలంటే వారికి తగిన మానసిక చికిత్స అవసరం అని వార్‌విక్ మెడికల్ స్కూల్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్న డాక్టర్ జేమ్స్ గిల్ అన్నారు.

ఇక రోగుల్లో చికిత్స తర్వాత తలెత్తే ఒత్తిడి ఉంటుందన్న విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. చాలా మందిలో చెప్పుకోదగ్గ మానసిక భయాలు కనిపిస్తాయి.

కొద్ది పాటి లక్షణాలు కనిపించే చాలా మంది రోగులు కూడా ఆయాసం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం లేకపోలేదు.

కోలుకున్న రోగి

ఇప్పటి వరకు ఎంత మంది కోలుకున్నారు?

కచ్చితమైన గణాంకాలు చెప్పడం కష్టం. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ నివేదిక ప్రకారం ఏప్రిల్ 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షలకుపైగా ఈ వ్యాధి బారిన పడితే వారిలో సుమారు 5 లక్షల మంది కోలుకున్నారు.

అయితే ఈ గణాంకాల విషయంలో ఒక్కో దేశం ఒక్కో పద్ధతిని అవలంబిస్తోంది. కొన్ని దేశాలు ఎంత మంది కోలుకున్నారన్న విషయంలో స్పష్టమైన నివేదికలు ఇవ్వడం లేదు.

అలాగే కొద్ది పాటి లక్షణాలు ఉండే చాలా కేసుల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు కూడా. మొత్తంగా 99నుంచి 99.5 శాతం మంది కోలుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మళ్లీ నాకు కోవిడ్-19 సోకే అవకాశం ఉందా ?

ఈ విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నా యి. వైరస్‌ను జయించిన రోగుల్లో అప్పటికే తగిన వ్యాధి నిరోధక వ్యవస్థ నిర్మితమవుతుంది.

అయినప్పటికీ వరుసగా రెండు సార్లు వైరస్ బారిన పడ్డారంటే బహుశా వారు కోలుకున్నారని తెలిపే పరీక్షల్ని నిర్వహించడం లోపం ఉండవచ్చు.

మొత్తంగా ఓ సారి ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉందా ? అలాగే టీకా ఎంత మేర ప్రభావం చూపించవచ్చు అన్నవిషయాలను తెలుసుకోవడంలో రోగ నిరోధక శక్తి పాత్ర చాలా ముఖ్యమైనది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19: How long will it take to recover from Coronavirus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X