వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా నుంచి వచ్చిన చాలా చెడ్డ కానుక: అమెరికా ఎంత చేసినా అంటూ డొనాల్డ్ ట్రంప్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కరోనా మహమ్మారి విషయంలో మరోసారి చైనాపై నిప్పులు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోయిందన్నారు. చైనా ఇచ్చిన ఒక చెడ్డ బహుమతి కరోనావైరస్ అని ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అయినప్పటికీ కరోనాను ఎదుర్కొనేందుకు ఆ దేశంతో పనిచేసేందుకు తాము సిద్ధమని అన్నారు.

Recommended Video

Donald Trump - 'That Is A Wrost Gift From China'
చైనా నుంచి వచ్చిన చాలా చెడ్డ కానుక

చైనా నుంచి వచ్చిన చాలా చెడ్డ కానుక

చైనా కరోనావైరస్ అనే కానుక ఇచ్చింది. అది చాలా చెడ్డది. చైనా దాన్ని ఆరంభంలోనే ఆపివుండాల్సింది. వైరస్ కారణంగా వుహాన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, వుహాన్ మినహా చైనాలోని ఏ నగరం కూడా కరోనా బారిన పడలేదు. దీనిపై చైనా సమాధానం చెప్పాలని ట్రంప్ అన్నారు.

అమెరికా నుంచి ఎన్నో లాభాలు పొంది.. కానీ..

అమెరికా నుంచి ఎన్నో లాభాలు పొంది.. కానీ..

అమెరికా నుంచి చైనా ఎన్నో లాభాలు పొందింది.చైనా పునర్నిర్మాణానికి అమెరికా 500 మిలియన్ డాలర్ల సాయం చేసింది. అమెరికా నుంచి భారీగా లబ్ధి పొందిన చైనా మాత్రం తిరిగి ఏమీ చేయలేదు. ప్రపంచంతో కలిసి పనిచేసినట్లుగానే.. చైనాతో కూడా ఉంటామని అన్నారు. అయితే, ఇప్పుడు జరిగింది మరోసారి మాత్రం పునరావృతం కాకూడదని తేల్చి చెప్పారు.

వ్యాక్సిన్ తయారీలో అద్భుత పురోగతి..

వ్యాక్సిన్ తయారీలో అద్భుత పురోగతి..

అంతేగాక, కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. వ్యాక్సిన్ తయారీలో అద్భుతమైన పురోగతి సాధించినట్లు ట్రంప్ చెప్పారు. భద్రతా పరమైన పరీక్షలు పూర్తయి, పరిస్థితులు అనుకూలంగా ఉంటే 2 మిలియన్ల వ్యాక్సిన్లను సరఫరా చేయగలమని తెలిపారు.

కరోనా సమర్థంగా ఎదుర్కొన్నాం..

కరోనా సమర్థంగా ఎదుర్కొన్నాం..

కరోనాను ఎదుర్కోవడంలో అమెరికా సరైన మార్గంలోనే వెళ్లిందని, గొప్పగా పనిచేసిందని అన్నారు ట్రంప్. ప్రపంచ చరిత్రలోనే అమెరికా అత్యంత గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఉంది. అదే కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సాయపడింది. తాము బాగా పనిచేస్తున్నామన్నారు. కరోనా నియంత్రణకు సరైన నిర్ణయాలే తీసుకున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ను అన్ని రాష్ట్రాల్లో ఎత్తివేస్తే ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ముందుకు వెళ్తుందన్నారు.

English summary
COVID-19 is a very bad gift from China: Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X