వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19: రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వారికి, తీసుకోని వారికి కరోనావైరస్ లక్షణాలలో వ్యత్యాసం ఉందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్-19

జలుబు, తలనొప్పి, తుమ్ములు, గొంతు నొప్పి, ఆగకుండా వచ్చే దగ్గు.. ఇవి వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కోవిడ్-19 సోకిన వారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు.

అయితే, వ్యాక్సీన్లు తీసుకోని వారిలో ఈ లక్షణాలు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది తమకు తొలనొప్పి ప్రధానంగా ఉందని చెబుతున్నారు. ఆ తర్వాత గొంతు నొప్పి, జలుబు, జ్వరం, దగ్గు కూడా ఉన్నాయని అంటున్నారు.

బ్రిటన్‌లో రెండేళ్లకుపైగా కోవిడ్-19 రోగులపై చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని కోసం టెక్నాలజీ సంస్థ జోయి ఒక ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించింది.

ఈ డేటాను కింగ్స్ కాలేజీ లండన్, బ్రిటిష్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ ఎన్‌హెచ్ఎస్ సంయుక్తంగా విశ్లేషించాయి.

కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన రోగులకు తమలో కనిపించే లక్షణాలను ఈ అప్లికేషన్‌లో నమోదు చేయాలని సూచించారు. దీంతో దాదాపు 47 లక్షల మంది దీనిలో తమ డేటా నమోదు చేశారు.

ఈ డేటాలో లక్షణాలను ఆరోహణ, అవరోహణ క్రమంలో నిపుణులు వర్గీకరించారు. ఎక్కువమందిని పీడించిన లక్షణాలను మొదట, తక్కువ మంది చెప్పిన లక్షణాలను చివరన పెట్టారు.

అయితే, వాసన లేదా రుచి చూసే శక్తి కోల్పోవడం లాంటి లక్షణాలు దీనిలో అట్టడుగున ఉన్నాయి.

కోవిడ్-19

ఏమిటీ తేడాలు?

రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వారిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు ఇవీ..

  • తుమ్ములు
  • జలుబు,
  • తలనొప్పి
  • గొంతు నొప్పి
  • దగ్గు
కోవిడ్-19

ఎలాంటి వ్యాక్సీన్ తీసుకోని వారిలో కనిపించే లక్షణాలు ఇవీ..

  • జ్వరం
  • తలనొప్పి
  • గొంతు నొప్పి
  • జలుబు
  • దగ్గు

వ్యాక్సీన్ తీసుకోని వారిలో జ్వరం ప్రధానంగా కనిపిస్తోంది. ఇది చాలా తీవ్రంగా కూడా మారుతోందని రోగులు చెబుతున్నారు.

వ్యాక్సీన్‌ తీసుకున్న వారితో పోల్చినప్పుడు తలనొప్పి, గొంతు నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంటోందని అధ్యయనంలో వెల్లడైంది.

''ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడి ఉండొచ్చు’’అని జోయి యాప్ ఒక ప్రకటన విడుదల చేసింది.

''వ్యాక్సీన్ తీసుకున్న వారిలో యువతలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. వీరిలో కనిపించే లక్షణాలు కూడా అంత తీవ్రంగా ఉండవు’’అని ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే, జోయి యాప్‌లో నమోదుచేసిన డేటాను మాత్రమే ఇక్కడ పరిశోధకులు విశ్లేషించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కరోనావైరస్ వేరియంట్లపై దీనిలో ఎలాంటి సమాచారమూ లేదు.

కోవిడ్-19

కరోనావైరస్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించిన లక్షణాలు ఇవీ..

  • జ్వరం
  • వణుకు
  • దగ్గు
  • వాసన చూసే శక్తి కోల్పోవడం
  • రుచి చూసే శక్తి కోల్పోవడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
  • అలసట
  • ఒళ్లు నొప్పులు
  • తలనొప్పి
  • గొంతునొప్పి
  • జలుబు
  • ఆకలి లేకపోవడం
  • డయేరియా
కోవిడ్-19

కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే ఇంటికే పరిమితం కావాలని, ఇతరులను కలవకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనారోగ్యాలు, వ్యాధి నిరోధక సమస్యలు ఉండేవారు చుట్టుపక్కల ఉండేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.

అదే సమయంలో అసలు వైరస్ సోకిందో లేదో నిర్ధారణకు వచ్చేందుకు కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలి.

ఆర్‌టీ-పీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులతో వైరస్ సోకిందో లేదో నిర్ధారించుకోవచ్చు.

టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లాలి.

ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మళ్లీ సాధారణ పనులను చేసుకోవచ్చు. అయితే, ఆరోగ్యం మరింత క్షీణిస్తే వెంటనే ఆసుపత్రి లేదా వైద్యులను సంప్రదించాలి.

కోవిడ్-19

వ్యాక్సీన్‌లు తీసుకున్న వారికి వైరస్ ఎందుకు సోకుతుంది?

కోవిడ్-19 సోకితే లక్షణాలు తీవ్రమయ్యే ముప్పును వ్యాక్సీన్లు తగ్గించగలవు. అదే సమయంలో మరణాలు, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని కూడా వ్యాక్సీన్లు తగ్గిస్తాయి.

ఏ రకమైన వ్యాక్సీన్ అయినప్పటికీ, వైరస్ లేదా బ్యాక్టీరియాతో రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పోరాడటమే లక్ష్యంగా వ్యాక్సీన్లు తయారుచేస్తారు.

వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత మన ఆరోగ్యంపై పెద్దగా ఎలాంటి ప్రతికూల ప్రభావమూ ఉండదు. నిజమైన వైరస్ వచ్చినప్పుడు ఎలా పోరాడాలో ఇది మన రోగ నిరోధక వ్యవస్థకు ఇది నేర్పిస్తుంది.

మన రోగ నిరోధక వ్యవస్థ అనేది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. దీనిలో చాలా కణాలు, యాంటీబాడీల స్పందనలు ఉంటాయి. అందుకే ఇది ఒక్కో వైరస్‌కు ఒక్కోలా స్పందిస్తుంటుంది.

మన శరీరాన్ని పీడిస్తున్న వ్యాధులతోపాటు వైరస్ వేరియంట్, వ్యాక్సీన్‌లో రకాలు ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థ స్పందనలపై ప్రభావం చూపిస్తాయి.

అయితే, ఎంత శక్తిమంతమైన వ్యాక్సీన్ వేసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో వైరస్ సోకకుండా అడ్డుకోవడం సాధ్యం కాదు.

వ్యాక్సీన్లు పూర్తిగా ఇన్ఫెక్షన్ సోకకుండా అడ్డుకోకపోవచ్చు. కానీ, లక్షణాల తీవ్రతను ఇవి తగ్గించగలవు. మరణ ముప్పు కూడా వీటితో తగ్గుతుంది.

రోటావైరస్, ఇన్‌ఫ్లూయెంజా లాంటి వ్యాక్సీన్ల విషయంలో ఇదే రుజువైంది. వీటితో చుట్టుముట్టే మరణ ముప్పును వ్యాక్సీన్లు గణనీయంగా తగ్గించగలిగాయి.

2021 చివర్లో, 2022 మొదట్లో ఒమిక్రాన్ వేరియంట్‌పై చేపట్టిన అధ్యయనాల్లోనూ ఇదే రుజువైంది. చాలాచోట్ల రికార్డు స్థాయిలో కేసులు నమోదైనప్పటికీ, మరణాలు ఆ స్థాయిలో లేవు.

వ్యాక్సీన్లు ఏ స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాయో అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (సీడీసీ) కూడా ఒక అధ్యయనం చేపట్టింది. దీనిలో మూడు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వారిలో ఆసుపత్రిలో చేరే, మరణ ముప్పులు 94 శాతం వరకూ తగ్గుతున్నాయని వెల్లడింది. మరోవైపు జోయి అప్లికేషన్ నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే రుజువైంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హైఫీవర్ లాంటి తీవ్రమైన లక్షణాలు కరోనావైరస్ వ్యాప్తి మొదట్లో ఎక్కువగా కనిపించాయని, వ్యాక్సీన్లు వేసుకున్న తర్వాత ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించడంలేదని వెల్లడైంది.

రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నప్పటికీ కళ్లు, ముక్కు, నోటి ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే, జలుబు లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

చాలా కేసుల్లో ఈ వైరస్‌ను వ్యాధి నిరోధక స్పందనలు అడ్డుకుంటాయి. శ్వాస తీసుకోవడం లాంటి విధుల్లో కీలకంగా పనిచేసే ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం చూపకుండా ఇవి నిలువరిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19: Is there a difference in coronavirus symptoms between those who have been vaccinated with two doses and those who have not
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X