వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవాలి : డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . శీతాకాలం ప్రారంభమైన సందర్భంగా పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతాయని ఇప్పటికే వైద్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇక కరోనా కేసులు కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు యుద్ధప్రాతిపదికన క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. డిసెంబర్ నెలలోగా కరోనా వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది అంటూ ఆశావహ దృక్పథంతో ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వచ్చే అవకాశం చాలా తక్కువంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్.
Recommended Video

కోవిడ్ వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ జయించాలన్న డబ్ల్యూహెచ్ఓ
అయితే కరోనా వ్యాక్సిన్ మాత్రమే కరోనాని నిరోధించడానికి ఆయుధం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోందని హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా, కరోనా సెకండ్ వేవ్ ను వ్యాక్సిన్ లేకుండానే జయించాల్సిన సమయమని హెచ్చరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ కరోనా వైరస్ విస్తరణతో పోరాడుతున్న దేశాలు ప్రస్తుతం వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ ను అధిగమించాలని ఆయన చెబుతున్నారు.

వ్యాక్సిన్ కోసం చూస్తూ వ్యక్తిగత జాగ్రత్త పాటించకుంటే ఇబ్బందే
వ్యాక్సిన్ కోసం చూస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకుంటే దారుణ పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది అంటూ ఆయన హెచ్చరిస్తున్నారు . ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందనేది తెలియని కారణంగా వ్యాక్సిన్ పై నమ్మకం పెట్టుకొని, అదే మ్యాజిక్ సొల్యూషన్ అని భావించి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బంది పడతారు అంటున్నారు. కరోనా వైరస్ ను విజయవంతంగా ఎదుర్కోవడానికి అనేక కంపెనీలు వ్యాక్సిన్ తయారీ కోసం పోటీ పడుతున్నాయి . కొన్ని వ్యాక్సిన్ లు వివిధ దశల్లో క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి.

కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తత అవసరం .. వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారం కాదు
ట్రయల్స్ లో ఉన్న టీకాలు అందుబాటులోకి రావడానికి 4 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుందని భావిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ లు మాత్రమే సమస్యలు పరిష్కరిస్తాయి అనుకోవడం తప్పు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వస్తుందని కరోనా నిబంధనలు పక్కనపెడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ పేర్కొన్న ఆయన కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తత అవసరమన్నారు.

95 శాతం ప్రభావవంతంగా ఫైజర్ సంస్థ కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ విషయంలో ఫైజర్ బుధవారం తన ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను పూర్తి చేసిన అధ్యయనం 95 శాతం ప్రభావవంతంగా ఉందని తేలిందని, తోటి అమెరికా సంస్థ మోడెర్నా ఈ వారం తన సొంత అభ్యర్థి 94.5 శాతం ప్రభావవంతంగా ఉందని తెలిపింది. రష్యా తన అభ్యర్థి 90 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉందని పేర్కొంది.
గత డిసెంబర్‌లో చైనాలో వ్యాప్తి చెందినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా కనీసం 55.6 మిలియన్ కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్లకు పైగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని తెలుస్తుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications