వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్‌ మంత్రదండం కాదు -ఇప్పుడే ఎక్కువ అప్రమత్తత అవసరం: WHO

|
Google Oneindia TeluguNews

గ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య గురువారం నాటికి 7.5కోట్లకు, మరణాల సంఖ్య 17లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 13 నెలలుగా ప్రపంచాన్ని ఆగం పట్టిస్తోన్న కరోనా మహమ్మారిని వ్యాక్సిన్లతోనైనా కట్టడి చేయొచ్చని భావిస్తుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా మరో బాంబు పేల్చింది. అగ్రదేశాలు సహా భారత్ లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలు సైతం వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్న తరుణాన డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది..

కరోనా వైరస్‌ను ఒక్కసారిగా తుడిచిపెట్టేందుకు వ్యాక్సినేమీ మంత్రదండం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతీయ కార్యాలయం గురువారం తెలిపింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన ఈ సమయంలోనే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సంస్థ పేర్కొంది. కొన్ని దేశాల్లో చలికాలం భయాలను కూడా ప్రస్తావిస్తూ డబ్ల్యూహెచ్ఓ రీజనల్‌ డైరక్టర్‌ తకేషి కసాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

పెళ్లి పేరుతో సెక్స్ -ప్రతిసారి నేరం కాబోదు -హైకోర్టు సంచలన తీర్పు - రేప్ కేసులో వ్యక్తి నిర్దోషిపెళ్లి పేరుతో సెక్స్ -ప్రతిసారి నేరం కాబోదు -హైకోర్టు సంచలన తీర్పు - రేప్ కేసులో వ్యక్తి నిర్దోషి

''మనం ఎవరైనా, ఎక్కడ జీవిస్తున్నా ప్రపంచంలో కరోనా వైరస్‌ ఉన్నంతకాలం అందరమూ ప్రమాదంలో ఉన్నట్లే లెక్క. ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని, మన చుట్టుపక్కల ఉన్నవారిని సురక్షితంగా ఉంచాలి. కరోనా వైరస్‌ గురించి భయాందోళనలు లేకుండా అప్రమత్తంగా ఉండాలి. వైద్యనిపుణుల సలహాలు, సూచనలు అనుసరించడం ద్వారానే మనం 2021ను సంతోషంగా ఆహ్వానించగలం'' అని తకేషి కసాయ్‌ అన్నారు.

Covid-19 vaccines ‘not a silver bullet’: WHO calls for greater vigilance amid vaccine roll out

కరోనాపై పోరులో ఏడాది కాలంగా నిర్విరామంగా శ్రమిస్తోన్న ఫ్రంట్ లైన్ వారియర్లను గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కసాయ్ అన్నారు. కొవిడ్ వ్యాధికి వ్యాక్సిన్‌ కనిపెట్టడం ఎంత పెద్ద సవాలో... దానిని ప్రపంచమంతటికీ సరిపోయేలా తయారు చేయడం, పంపిణీ చేపట్టడం అంతకంటే పెద్ద సవాలని ఆయన పేర్కొన్నారు.

జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనంజగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనం

మాస్కులు ధరించడం, సామాజికదూరాన్ని పాటించడం, వైరస్‌ సంక్రమిత ప్రాంతాలకు దూరంగా ఉండటం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్‌ నుంచి క్షేమంగా ఉండగలుగుతామని డబ్ల్యూహెచ్ఓ అధికారి తెలిపారు. కొవిడ్‌-19 ను ఒక్కసారిగా మాయంచేసేందుకు వ్యాక్సిన్‌ మంత్రదండం కాదన్నారు. ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ప్రజారోగ్య రక్షణ విషయాల్లో యువత భాగస్వామ్యం ఈ సమయంలో చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.

English summary
A top World Health Organization (WHO) official has called for greater vigilance amid the roll-out of a Covid-19 vaccine, saying the vaccine is not a “silver bullet” that will end the nearly year-long pandemic which has infected over 74 million people across the globe and killed more than 1.64 million others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X