వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Good news:యూరప్‌లో ఒమిక్రాన్‌తో వైరస్ ఎండ్ కార్డు: డబ్ల్యుహెచ్‌వో

|
Google Oneindia TeluguNews

కరోనా హడలెత్తిస్తోంది. ఒమిక్రాన్ వాయు వేగంతో వ్యాపిస్తోంది. ఇక యూరప్‌లో అయితే చెప్పక్కర్లేదు. దీనికి సంబంధించి బిగ్ రిలీఫ్ కలిగే అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ఒమిక్రాన్ ఏడాది చివరి వరకు వైరస్ మళ్లీ వచ్చినా.. యూరప్‌లో మాత్రం అంతం అవుతుందని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో యూరప్ డైరెక్టర్ హన్స్ క్లూజ్ వివరించారు. ఆయన ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ వార్తా సంస్థకు మాట్లాడుతూ సంచలన విషయాన్ని వెల్లడించారు.

 60 శాతం కేసులు

60 శాతం కేసులు

మార్చి వరకు యూరప్‌లో 60 శాతం మంది ఒమిక్రాన్ బారినపడతారని క్లూజ్ వెల్లడించారు. అంటే దీంతో వైరస్ చివరి దశకు చేరుకుంటుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని వారాలు, నెలలపాటు ప్రభావం ఉంటుందని తెలియజేసింది. టీకా వల్ల జనానికి రోగ నిరోధక శక్తి పెరిగిందని వివరించారు. అంతేకాదు కరోనా రాక ముందు జనం ఎలా ఉండేవారో.. ఇప్పుడు కూడా అలానే అంతా తయారవుతున్నారని తెలిపారు. అంతేకాదు మరోసారి వైరస్ అటాక్ ఉండబోదని క్లూజ్ తెలిపారు.

మరణాలు తక్కువ..

మరణాలు తక్కువ..

క్లూజ్ మాదిరిగానే అమెరికా ప్రభుత్వ ఆరోగ్యశాఖ ముఖ్య సలహాదారు ఆంటోని ఫౌసీ కూడా ఇదేవిధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికాలోని కొన్ని చోట్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. అలా దేశవ్యాప్తంగా పరిస్థితి వస్తోందని చెప్పారు. ఆఫ్రికాలో కరోనా మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫోర్త్ వేవ్ వచ్చిన తర్వాత తగ్గడం ఇదే తొలిసారి అని చెప్పారు.

Recommended Video

COVID-19 Norms For International Travellers | Oneindia Telugu
 దరి చేరదు

దరి చేరదు

వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. నార్వే, ఐస్‌లాండ్, లిచెస్తియన్‌లో వేగంగా వ్యాప్తి చెంది ఉంది. యూరప్‌లో 15 శాతం ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. 53 దేశాల్లో వ్యాధి తీవ్రత ఉంది. అంతకుముందు 6.3 శాతం మాత్రమే ఉండేది. వ్యాక్సినేషన్ కూడా శరవేగంగా పెరిగింది. 25 శాతం నుంచి 95 శాతం చేరడంతో.. కేసుల తీవ్రత కాస్త తగ్గుతున్నాయి.

English summary
current Omicron wave is over in Europe, the pandemic situation could be over in the region even as the virus may come back by the end of this year, World Health Organisation Europe director Hans Kluge said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X