బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వైరస్ దెబ్బతో 54 వేల మంది ఖైదీలు విడుదల, మా వల్లకాదే, ప్రభుత్వాలకే షాక్, కంట్రోల్ కావాలి !

|
Google Oneindia TeluguNews

టెహ్రాన్/ ఇరాన్: కోవిడ్- 19 (కరోనా వైరస్) మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల ప్రభుత్వాలకు కరోనా వైరస్ వణుకు పుట్టిస్తోంది. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన 2, 977 మందికిపైగా మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలతో కలిపితే 3 వేల మంది వరకు చనిపోయారని వెలుగు చూసింది. చైనా తరువాత అత్యధికంగా ఇరాన్ లో 66 మంది కరోనా వైరస్ వ్యాదితో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇరాన్ లో 1, 500 మందికి కరోనా వ్యాధి సోకిందని నిర్దారణ అయ్యిందని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడి ప్రజలు హడలిపోయారు. ఇరాన్ లో 54, 000 ఖైదీలను విడుదల చెయ్యాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 70 దేశాల్లో 88 వేల మందికి కరోనా వైరస్ వ్యాధి సోకింది. భారత్ లో మరో రెండు కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి.

బెంగళూరు టెక్కీకి కరోనా వైరస్, అలర్ట్, కూతురి పెళ్లి పక్కన పెట్టి మంత్రి బిజీబిజీ, హైదరాబాద్ !బెంగళూరు టెక్కీకి కరోనా వైరస్, అలర్ట్, కూతురి పెళ్లి పక్కన పెట్టి మంత్రి బిజీబిజీ, హైదరాబాద్ !

 ఎంత కాలం శిక్ష పడింది ?

ఎంత కాలం శిక్ష పడింది ?

ఇరాన్ లో 5 ఏళ్ల కంటే తక్కువ పడిన ఖైదీలు ఎంత మంది ఉన్నారు అంటూ ఇప్పటికే అధికారులు లెక్కలు వేశారు. 5 ఏళ్లలోపు శిక్ష పడిన ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారిని వెంటనే విడుదల చేస్తామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఖైదీలను తాత్కాలికంగానే విడుదల చెయ్యాలని నిర్ణయించామని ఇరాన్ ప్రభుత్వం తెలిపిందని బీబీసీ న్యూస్ వార్తలు ప్రసారం చేసింది.

 జైళ్లలో ఖాళీలు లేవు

జైళ్లలో ఖాళీలు లేవు

ఇరాన్ జైళ్లు ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. జైళ్లలో ఖైదీలు ఉండటానికి అకాశాలు చాలా తక్కువగా ఉండటం, కరోనా వైరస్ రోజురోజుకు వ్యాపిస్తుండటంతో హడలిపోయిన ఇరాన్ ప్రభుత్వం వెంటనే 54, 000 మంది ఖైదీలను విడుదల చెయ్యాలని నిర్ణయించిందని బీబీసీ న్యూస్ తెలిపింది.

ఖైదీలకు షరతులు

ఖైదీలకు షరతులు

ఇరాన్ జైళ్లలో ఉన్న 54, 000 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ లేని ఖైదీలను విడుదల చేస్తున్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ఖైదీలను వెంటనే ఆసుపత్రులకు తరలించి ప్రత్యేక వైద్య చికిత్సలు చేయిస్తున్నారు. కరోనా వైరస్ తో పాటు ఎలాంటి ప్రాణాంతక వ్యాధి లేదని తెలిసిన ఖైదీలను జామీను మీద బయటకు వదిలిపెడుతున్నారు.

ఆ ఖైదీలకు నో చాన్స్

ఆ ఖైదీలకు నో చాన్స్

ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడిన ఖైదీలను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో విడుదల చేసే అవకాశం లేదని, 5 ఏళ్లలోపు శిక్ష పడిన ఖైదీలను మాత్రమే విడుదల చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇరాన్ న్యాయ శాఖా ప్రతినిధి ఘోలామ్ హుసేన్ ఎస్కేలి బీబీసీ వార్త సంస్థకు తెలిపారు.

Recommended Video

Coronavirus In Hyderabad |Follow These Things To Prevention Of Corona Oneindia Telugu
ఇరాన్ జైల్లో బ్రెజిల్ జాతీయులు

ఇరాన్ జైల్లో బ్రెజిల్ జాతీయులు

ఇరాన్ జైళ్లలో బ్రెజిల్ జాతీయులు శిక్ష అనుభవిస్తున్నారు. బ్రెజిల్ సైతం కరనా వైరస్ వ్యాధికి భయపడిపోయింది. ఇరాన్ లోని ఎవిన్ జైలులో ఉన్న బ్రిటీష్- ఇరాని చారిటి ఉద్యోగి జాగారి రాట్ క్లిప్ ను త్వరలో జైలు నుంచి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ బ్రిటీష్ ఎంపీ తెలిపారు. రాట్ క్లిప్ గూడచారి అనే అనుమానంతో ఇరాన్ ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. రెండు మూడు రోజుల్లో రాట్ క్లిప్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని బ్రిటన్ లోని ఇరాన్ రాయభారి కార్యాలయం అధికారి తులీప్ సిద్దిక్ చెప్పారని బ్రిటన్ ఎంపీ స్థానిక మీడియాతో అన్నారు.

 కరోనాకు 3, 330 మంది బలి !

కరోనాకు 3, 330 మంది బలి !

కోవిడ్- 19 (కరోనా వైరస్) వ్యాధితో మంగళవారం రాత్రి వరకు 3, 330 మంది మరణించారని వివిద మీడియా సంస్థలు తెలిపాయి. చైనాలో 2, 977 మంది కరోనా వైరస్ వ్యాధితో మరణించారని సమాచారం. ఇరాన్ లో 12 మంది కరోనా వైరస్ తో మరణించారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అయితే 66 మంది ఇరాన్ లో కరోనా వైరస్ తో మరణించారని ప్రచారం జరుగుతోంది. ఇరాన్ లో 800 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. మొత్తం మీద ఇరాన్ లో కరోనా వైరస్ వ్యాధికి భయపడిన అక్కడి ప్రభుత్వం 54, 000 మంది ఖైదీలను విడుదల చేస్తోంది.

English summary
Iran: Deadly Coronavirus Iran Frees 54,000 Prisoners To Control Virus Spread. Iran Government Confirms It. Temporarily Frees 54,000 Prisoners On Bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X