సెకన్ల ముందు: ఇండోనేషియా సునామీ భయానకం(వీడియో): 1,571కి చేరిన మృతుల సంఖ్య
Recommended Video

జకార్తా: గత కొద్దిరోజుల క్రితం ఇండోనేషియాలో సంభవించిన భూకంపం, భారీ సునామీ కారణంగా భారీ ఆస్తి నష్టం, వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సునామీ ధాటికి సులవేసి దీవిలోని పాలూ నగరం అతలాకుతలమైంది.
భవనాలు కూలిపోవడంతో వాటి శిథిలాల కింద భారీగా మృతదేహాలు చిక్కుకున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య శుక్రవారానికి 1,571కి చేరినట్లు అధికారులు తెలిపారు. భూకంపం-సునామీ కారణంగా 70 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.

కాగా, ఇండోనేషియాలో సంభవించిన సునామీకి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రహదారులపైకి ఒక్కసారిగా సునామీ వల్ల చెట్లు, భవనాలు మొత్తం కొట్టుకుని వచ్చేశాయి.
Indonesia. Few seconds before Tsunami & when it hits pic.twitter.com/oLOgOVMLgI
— @akashtv1soni (@Akashtv1Soni) October 5, 2018
అంతవరకు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి ఒక్కసారిగా సునామీ నీరు చేరింది. రోడ్డుపై వెళ్తున్న ప్రజలు సునామీని గుర్తించి వెంటనే తమ కార్లను వెనక్కి వేగంగా తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సునామీ బీభత్సాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.












Click it and Unblock the Notifications