ఈక్వెడార్ లో భూకంపం: 400 మంది బలి
ఈక్వెడార్: ఈక్వెడార్ భూకంపం వలన సోమవారానికి 400 మంది మరణించారని అక్కడి అధికారులు వెల్లడించారు. తీవ్రగాయాలైన వారు మరణించే అవకాశం ఉందని అధికారులు అన్నారు. శిథిలాల నుంచి క్షతగాత్రుల్ని రక్షించేందుకు సహాయక సిబ్బంది నిరంతరం శ్రమిస్తోంది.
సహాయక సిబ్బంది నిరంతం శ్రమిస్తోందని దేశాధ్యక్షుడు రఫేల్ కొరెయో తెలిపారు. పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలోని నగరాల్లో వందల ఇళ్లు, వాణిజ్య కట్టడాలు నేలమట్టం అయ్యాయి. రాజధాని నగరం క్విటో మాత్రం పెను ప్రమాదం నుంచి తప్పించుకుందని అధికారులు అన్నారు.
భవనాలకు పగుళ్లు, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, పెద్ద నష్టం జరగలేదని అధికారులు వివరించారు. దేశంలోని ఆయిల్ పరిశ్రమకు పెద్ద నష్టం జరగలేదని అన్నారు. పోర్టో వీజో జైలుల్లో గోడలు కూలిపోవడంతో 100 మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారు.

బాగా దెబ్బతిన్న పోర్టో వీజో లో శిథిలాల నుంచి దుర్వాసన వస్తున్నది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే చర్యలను వేగవంతం చేశారు. బాగా దెబ్బతిన్న రాష్ర్టాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. అక్కడి ప్రజలు హక్కులు, స్వేచ్చ తాత్కాలికంగా రద్దు అయ్యింది.
పొరుగు దేశం కొలంబియాలో కొంత నష్టం జరిగింది. తమ వారి కొసం శిథిలాల కింద బంధువులు పడిగాపులు పడుతున్నారు. మా వారిని రక్షించుకుంటున్నామని ఆర్తనాదాలు చేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటకు వస్తారని బాధితులు ఆశగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications