'విమాన ప్రమాదంతోనే నేతాజీ మృతి చెందారు'
లండన్: విమాన ప్రమాదం అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైపీలోని ఓ సైనిక ఆస్పత్రిలో మరణించారని బ్రిటన్‌కు చెందిన bosefiles.info అనే వెబ్‌సైట్ వెల్లడించింది. 1943 నుంచి 1945 వరకూ నేతాజీతో కలిసి పనిచేసిన అనువాదకుడు కాజునోరి కునిజుకా ఈ విషయాన్ని తెలిపారని పేర్కొంది.
ఇప్పటికీ జీవించివున్న కాజునోరి.. బోస్ చివరి రోజుల గురించి, 18 ఆగస్టు 1945న తైపీలో విమానప్రమాదం అనంతరం ఆయన మరణం గురించి పూర్తి వివరాలను ఒక డైరీలో పేర్కొన్నట్లు ఈ వెబ్‌సైట్ తెలియజేసింది.

నోబురు ఒకాబే అనే ప్రతినిధి ఈ డైరీ కాపీని వెబ్‌సైట్‌కి అందించినట్లు తెలిసింది. కాగా, bosefiles.info వెబ్‌సైట్‌ను నేతాజీ సమీప బంధువు అశీష్‌రే ఏర్పాటుచేశారు. ఆ డైరీ జపనీస్ భాషలో ఉందని, దాన్ని అనువాదం చేసి వెబ్‌సైట్ పొందుపర్చామని ఆశీష్ రే తెలిపారు.












Click it and Unblock the Notifications