పాక్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా కూతురు దినా మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: పాకిస్థాన్ జాతిపిత మ‌హ్మ‌ద్ అలీ జిన్నా ఏకైక కుమార్తె దినా వాడియా గురువారం న్యూయార్క్‌లోని త‌న ఇంట్లో మృతి చెందారు. 98 ఏళ్లు వయస్సు గల ఆమె గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.

ఆమె మ‌ర‌ణ‌వార్త‌ను వాడియా గ్రూప్ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఆమెకు కుమారుడు, వాడియా గ్రూప్ చైర్మ‌న్ నుస్లీ ఎన్ వాడియా, కూతురు డ‌యానా ఎన్ వాడియా ఉన్నారు. ఆమె అంత్య‌క్రియ‌లు న్యూయార్క్‌లో జరగనున్నాయి.

Dina Wadia: Jinnah’s daughter, and a symbol of India and Pakistan’s tumultuous history

గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా దినా వాడియా కుటుంబం న్యూయార్క్‌లో ఉంటోంది. వ్యాపార అవ‌స‌రాల నిమిత్తం నుస్లీ వాడియా ముంబైకి వ‌స్తుంటాడు.

1919 ఆగ‌స్టు 15న జ‌న్మించిన దినా వాడియా, పార్శీ కుటుంబానికి చెందిన నెవెల్లీ వాడియాను 1938లో పెళ్లి చేసుకుంది.

దేశంలో ఎంతో మంది ముస్లిం అబ్బాయిలు ఉండ‌గా పార్శీ వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డం ఎందుక‌ని తండ్రి ఆమెను ప్ర‌శ్నించ‌గా మ‌రి నువ్వెందుకు పార్శీ అమ్మాయిని చేసుకున్నావ్? అని దినా తిరిగి ప్రశ్నించిందని అంటారు. మ‌హ్మ‌ద్ అలీ జిన్నా కూడా పార్శీ కుటుంబానికి చెందిన ర‌త్త‌న్ బాయిని పెళ్లిచేసుకున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dina Wadia, the 98-year-old daughter of Pakistan’s founding father Muhammad Ali Jinnah, is no more.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి