'దిత్వా' తుపాను బీభత్సానికి 123 మంది బలి, 130 మంది గల్లంతు !!

'దిత్వా' తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. శ్రీలంకను అతలాకుతలం చేసిన ఈ తుపాను భారీ వర్షాలు, వరదలతో దేశాన్ని ముంచెత్తింది. ఈ కారణంగా ఇప్పటి వరకు 123 మంది మరణించగా.. మరో 130 మంది గల్లంతైనట్లు విపత్తు నిర్వహణ కేంద్రం (DMC) వెల్లడించింది. సుమారు 43,995 మంది నిరాశ్రయులయ్యారని.. వారిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించినట్టు సమాచారం. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా తుపాను శ్రీలంక తీరం నుంచి భారత్ వైపు కదులుతున్నప్పటికీ.. దేశంలో తీవ్ర నష్టాన్ని కలిగించిందని అధికారులు పేర్కొన్నారు. రాజధాని కొలంబో గుండా ప్రవహించే కెలని నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాటికే కెలని నది ఉప్పొంగడంతో వందలాది మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, సాయుధ బలగాలు ఈ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని వివరించారు.

dithwa-cyclone-causes-123-death-and-130-missing-at-srilanka

ప్రస్తుతం హెలికాప్టర్లు, పడవల సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. 2016లో సంభవించిన వరదల కంటే ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. ఇప్పటికే బాధితుల కోసం విమానంలో సహాయ సామగ్రిని పంపింది. ప్రాణనష్టం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని 'ఎక్స్' వేదికగా హామీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఏపీ వైపు తుఫాను దిత్వా దూసుకురావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై అధికార యంత్రాంగానికి కీలక దిశా నిర్దేశం చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ సమయంలో అత్యవసరం అయితే మినహా ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉండడంతో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సర్కారు ప్లాన్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+