పాకిస్థాన్ చెరలో ఉన్న భారతీయులు ఎంత మందో తెలుసా..?

భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉన్న సంబంధాల్లో అత్యంత సున్నితమైన అంశాల్లో ఖైదీల మార్పిడి ఒకటి. ఈ నేపథ్యంలో, జూలై 1, 2025న భారత ప్రభుత్వం, పాకిస్థాన్‌ ప్రభుత్వం తమ తమ కస్టడీలో ఉన్న ఖైదీల జాబితాలను పరస్పరం దౌత్య మార్గాల్లో మార్పిడి చేసుకున్నాయి. ఇది 2008లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా కొనసాగిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీల్లో ఖైదీల జాబితాలను పరస్పరం దౌత్య మార్గాల్లో పంచుకోవాలి అని నిబంధన ఉంది.

కాగా భారత్ తరఫు నుంచి దేశీయ జైళ్లలో ఉన్న పాకిస్తాన్ పౌరుల వివరాలను న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు అందించింది. ఇందులో మొత్తం 463 మంది పాకిస్థాన్ జాతీయులు ఉన్నారు. వీరిలో 382 మంది పౌర ఖైదీలు, 81 మంది పాకిస్థాన్‌ మత్స్యకారులు ఉన్నారు. ఈ జాబితా ద్వారా పాకిస్థాన్‌కు చెందిన వారు ఎవరు, ఏ కేసుల్లో ఉద్దేశించి ఉన్నారు అన్న స్పష్టత కలుగుతుందని అధికారులు తెలిపారు. భద్రతా పరిరక్షణ చర్యలతో పాటు, మానవతా దృష్టికోణంలో ఈ మార్పిడి ఒక కీలక అడుగుగా పరిగణించబడుతోందని వ్యాఖ్యానించారు.

do-you-know-how-many-indians-are-in-pakistan-captivity

అలానే పాకిస్థాన్ తరఫు నుంచి కూడా ప్రభుత్వం తమ దేశంలో ఉన్న భారతీయ ఖైదీల వివరాలను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు పంపింది. పాక్ అందించిన జాబితాలో 53 మంది పౌర ఖైదీలు, 193 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు. మొత్తం 246 మంది భారతీయులు పాక్ కస్టడీలో ఉన్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారిని త్వరితగతిన విడుదల చేసి స్వదేశానికి పంపించాలని భారత్ పాకిస్థాన్‌ను కోరింది.

2008 ఒప్పందం కీలక ముఖ్యాంశాలు..

ఈ ఒప్పందం ద్వారా అన్యాయంగా జైల్లో ఉన్నవారిని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.

వారి స్వస్థలాలకు పంపించే మార్గాన్ని రూపొందించేందుకు వీలవుతుంది

మానవతా విలువలు, అంతర్జాతీయ నైతిక ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించే అవకాశం

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను కోరిన అంశాలు..

తమ ఖైదీలను త్వరితగతిన విడుదల చేయాలని

వారిపై మానవహక్కుల ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలని

కన్సులర్ యాక్సెస్ వెంటనే ఇవ్వాలని

న్యాయ సహాయం అందించే వీలును కల్పించాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+