వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయపడేది లేదు! మొత్తం సైనిక శక్తి దించుతాం: ఉ.కొరియాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

అమెరికా, ఉత్తరకొరియాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వరుస అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్

|
Google Oneindia TeluguNews

సియోల్: అమెరికా, ఉత్తరకొరియాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వరుస అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీచేశారు.

పెనుముప్పే, సహనం నశించింది: కిమ్ జోంగ్‌పై ట్రంప్ ఆగ్రహం, జపాన్ ఫుల్ ‌సపోర్ట్ పెనుముప్పే, సహనం నశించింది: కిమ్ జోంగ్‌పై ట్రంప్ ఆగ్రహం, జపాన్ ఫుల్ ‌సపోర్ట్

ఉతరకొరియాపై ఆగ్రహం

ఉతరకొరియాపై ఆగ్రహం

రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దక్షిణకొరియాకు చేరుకున్న ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు మూన్‌ జే యిన్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం సంయుక్తంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ట్రంప్‌ ఉత్తర కొరియాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

భయపడేది లేదు.. పూర్తి సైనిక శక్తి ఉపయోగిస్తాం..

భయపడేది లేదు.. పూర్తి సైనిక శక్తి ఉపయోగిస్తాం..

ఉత్తర కొరియాతో అణుయుద్ధం వస్తే తమ పూర్తి సైనికశక్తిని వినియోగిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఉత్తర కొరియా నియంత కిమ్‌ బెదిరింపు ధోరణిని నియంత్రించేందుకు యావత్‌ సైనికశక్తిని ఉపయోగించేందుకు సిద్ధమని, కిమ్‌ బెదిరింపులకు భయపడబోమని ట్రంప్ స్పష్టం చేశారు.

రెడ్ కార్పెట్ స్వాగతం

రెడ్ కార్పెట్ స్వాగతం

తొలుత సియోల్‌కు దగ్గర్లోని ఓసాన్‌ ఎయిర్‌ బేస్‌లో తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి దిగిన ట్రంప్‌కు అధికారులు రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో బయల్దేరి ఆ దేశంలోని అతిపెద్ద యూఎస్‌ మిలటరీ బేస్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ మూన్‌తో కలిసి అమెరికా, దక్షిణ కొరియా సైనికులతో సమావేశమయ్యారు. ఉత్తరకొరియా అంశంపై వారితో చర్చించారు.

దక్షిణ కొరియాపై ట్రంప్ ప్రశంసలు

దక్షిణ కొరియాపై ట్రంప్ ప్రశంసలు

అంతేగాక, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు ట్రంప్. ఉత్తరకొరియాతో సవాళ్లను ఎదుర్కొంటూనే అమెరికా, దక్షిణ కొరియా వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు విశేష కృషిచేస్తున్నారని కొనియాడారు.

జపాన్ పర్యటనలో కూడా..

జపాన్ పర్యటనలో కూడా..

కాగా, ఐదు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జపాన్‌కు వెళ్లిన ట్రంప్‌ సోమవారం జపాన్‌ ప్రధాని షింజో అబేతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తరకొరియాపై వ్యూహాత్మక సహనం నశిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. తగిన గుణపాఠం చెప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
President Donald Trump has warned North Korea the United States is prepared to use the full range of its military power if needed to defend itself and its allies, during a visit to South Korea that took him to heart of the nuclear standoff with Pyongyang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X