ఆలు లేదు.. చూలు లేదు..!!

Israel Iran Ceasefire: ఇజ్రాయెల్‌- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ముదురుతోంది.. కనివినీ ఎరుగని విధంగా ఉధృతమౌతోంది. వరుసగా 12వ రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య 12 రోజులుగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సంపూర్ణ, సమగ్ర కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు.

Donald Trump declared Israel and Iran have agreed for complete and total ceasefire

దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందం ప్రకారం- ఇరాన్ 12 గంటల తరువాత కాల్పుల విరమణను ప్రారంభిస్తుంది. ఇజ్రాయెల్ 24 గంటల తరువాత కాల్పుల విరమణను అమలు చేస్తుంది. మొత్తం 24 గంటల వ్యవధిలో- ఈ 12 రోజుల యుద్ధం అధికారికంగా ముగిసినట్టవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.

కాల్పుల విరమణకు అంగీకరించిన ఈ రెండు దేశాలను అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కాల్పుల విరమణ సమయంలో- ఇరు దేశాలు శాంతియుతంగా, గౌరవంగా వ్యవహరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోన్నానని అన్నారు. ఈ సీజ్ ఫైర్ ప్రక్రియ మొత్తం కూడా సజావుగా సాగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ యుద్ధాన్ని ముగించడానికి ఓర్పు, ధైర్యం, మేధస్సు ప్రదర్శించిన ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలకు అభినందనలు తెలియజేస్తోన్నానని ట్రంప్ చెప్పారు. ఈ యుద్ధం.. సంవత్సరాల తరబడి కొనసాగి, మధ్య- తూర్పు ప్రాంతం మొత్తాన్నీ నాశనం చేసే ప్రమాదం ఉందని, అలా జరగలేదని తెలిపారు. ఇక ఎప్పటికీ జరగబోదనీ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌, ఇరాన్‌, మధ్య ఆసియా రీజియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాటు ఈ ప్రపంచం మొత్తాన్నీ దేవుడు దీవించుగాక అంటూ తన ట్వీట్ ను ముగించారు ట్రంప్. ఈ కాల్పుల విరమణ ఒప్పందం మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక శాంతికి మార్గం సుగమం చేస్తుందని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+