వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు షాక్, యుద్ధభూమికి అణ్వాయుధాలు: అమెరికా తీవ్ర చర్య ఇదే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా యుద్ధ సన్నాహాల్లో మునిగినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియాతో తాడాపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ దిశగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి బోరిస్ తెలిపారు.

Recommended Video

North Korea Vs Japan చుక్కలు చూపిస్తున్న కిమ్ జపాన్ పై మళ్లీ క్షిపణి ప్రయోగం | Oneindia Telugu

ఉత్తరకొరియాతో ఇక తాడోపేడో, యుద్ధం దిశగా అమెరికా అడుగులు.. 24 గంటలు హైఅలర్ట్!ఉత్తరకొరియాతో ఇక తాడోపేడో, యుద్ధం దిశగా అమెరికా అడుగులు.. 24 గంటలు హైఅలర్ట్!

దక్షిణ కొరియా నావికా దళం కూడా తన అధికారిక ఫేస్‌బుక్‌లో అమెరికా యుద్ధ సన్నాహాల్లో ఉన్నట్లు తెలిపింది. రష్యా అధికారిక పత్రిక కూడా దీనిని ధ్రువీకరించింది.

కింగ్ జాంగ్ ఉన్ దూకుడు: మరో అణు పరీక్షకు సిద్ధమయ్యాడా?కింగ్ జాంగ్ ఉన్ దూకుడు: మరో అణు పరీక్షకు సిద్ధమయ్యాడా?

 దక్షిణ కొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు

దక్షిణ కొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు

ఇప్పటికే దక్షిణ కొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు చేరుకున్నాయని, దీనిలో భాగంగానే అమెరికాకు చెందిన అణుజలాంతర్గామి యుఎస్‌ఎస్‌ మిచిగన్ వారం క్రితమే దక్షిణ కొరియాలోని బుసాన్‌ పోర్టుకు చేరుకుందని దక్షిణ కొరియా నావికా దళం అధికారిక ఫేస్‌బుక్‌ పేజ్‌లో పేర్కొంది.

 ధ్రవీకరించిన రష్యా పత్రిక

ధ్రవీకరించిన రష్యా పత్రిక

రష్యా అధికారిక పత్రిక కూడా దీనిని ధ్రువీకరించింది. ఉత్తర కొరియాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఈ చర్యను చేపట్టినట్లుగా భావిస్తున్నారు.

 అమెరికా అతి తీవ్రమైన హెచ్చరిక ఇదే

అమెరికా అతి తీవ్రమైన హెచ్చరిక ఇదే

ఇప్పటి వరకు ఉత్తర కొరియా విషయంలో అమెరికా చేపట్టిన తీవ్రమైన హెచ్చరిక చర్య ఇదేనని అంటున్నారు. ఈ జలాంతర్గామి అణువార్‌ హెడ్స్‌ను దక్షిణ కొరియాకు చేర్చి ఉంటుందని వీరు భావిస్తున్నారు. సుదూర లక్ష్యాలను తాకే క్షిపణులు ఈ సబ్‌మెరైన్‌లో ఉన్నాయి.

 భారీ లక్ష్యాలను ఛేదించగలవు

భారీ లక్ష్యాలను ఛేదించగలవు

దాదాపు 18000 టన్నుల బరువు ఉండే యుఎస్‌ఎస్‌ మిచిగాన్ 154 తోమహక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి పద్నాలుగు వందల దూరంలోని లక్ష్యాలను చేధించగలవు. గతంలో అమెరికా వీటిని ఉపయోగించింది. యుఎస్‌ఎస్‌ మిచిగాన్‌ ఒహియో శ్రేణికి చెందిన న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌‌లు 18 ఉన్నాయి. ఇవి భారీ అణ్వాయుధాలను తీసుకెళ్లగలవు.

 ప్యోంగాంగ్ దిశగా భారీ యుద్ధనౌక

ప్యోంగాంగ్ దిశగా భారీ యుద్ధనౌక

అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక యుఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్ బుసాన్‌ చేరుకుంది. దీంతో అమెరికా వాయుసేన బృందాలు కూడా దక్షిణ కొరియాకు చేరాయి.

English summary
THE United States is “totally prepared” to respond to threats from Pyongyang, President Donald Trump declared, while also emphasising his “exceptional relationship” with China’s leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X