Project 2025: అంతా ట్రంపే చేశాడు: ఏమీ మిగిల్చలేదు: కమలా హ్యారిస్ షాకింగ్
Donald Trump-Kamala Harris debate 2024: గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ డిబేట్‌కు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వారిద్దరి మధ్య ఏర్పాటైన తొలి డిబేట్ ఇదే.

పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా దీనికి వేదిక. అమెరికా కాలమాన ప్రకారం సరిగ్గా మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ డిబేట్ ఆరంభమైంది. లారా లూమర్.. దీనికి కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఏబీసీ న్యూస్ ఈ డిబేట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ఇద్దరు నేతల షేక్ హ్యాండ్‌తో డిబేట్ మొదలైంది. ఆర్థికాంశాలు తొలుత ప్రస్తావనకు వచ్చాయి. అమెరికాను కలవరపాటుకు గురి చేస్తోన్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి విషయాలపై డొనాల్డ్ ట్రంప్ దాడికి దిగారు. తాను అధికారంలోకి వస్తే అమలు చేయదలిచిన ప్రాజెక్ట్ 2025 గురించి క్లుప్తంగా వివరించారు.
అనంతరం కమలా హ్యారిస్ చైనా అంశాన్ని లేవనెత్తారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2016- 2020 మధ్య కాలంలో ఆయన అనుసరించిన విదేశాంగ విధానంతో ఎదురుదాడికి దిగారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఖజానా ఖాళీ అయిందని, నిరుద్యోగం, ఆర్థిక భారం పడటానికి ఆయన పరిపాలనే ప్రధాన కారణమంటూ ఆరోపించారు.
ఆయన పరిపాలనలో ప్రజారోగ్యం అత్యంత దారుణంగా మారిందని కమలా హ్యారిస్ ధ్వజమెత్తారు. అమెరికాలో అంతర్యుద్ధం తరువాత ఆ స్థాయిలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నదని ఆరోపించారు. దాన్ని సరిదిద్దలేనంతగా ధ్వంసం చేశారంటూ విమర్శల దాడికి దిగారు.












Click it and Unblock the Notifications