వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్న ట్రంప్, వలసలకు చెక్ పెట్టేనా?

కొత్త ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుదవారం నాడు సంతకం చేయనున్నారు. గతంలో ఇచ్చిన ఆర్డర్ పై ఫెడరల్ కోర్టు నిలిపివేయడంతో కొత్త ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ట్ర

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై బుదవారం నాడు సంతకం చేయనున్నారు. అమెరికా కాంగ్రెస్ లోని చట్ట ప్రతినిధులతో ఉమ్మడిగా సమావేశమైన తర్వాత ఆయన సంతకం చేసే అవకాశం ఉన్నట్టుగా వైట్ హౌజ్ వర్గాలు చెబుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాద్యతలు స్వీకరించిన తర్వాత ఏడు ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను విధించారు.ఈ విషయమై ట్రంప్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

Donald Trump to sign new immigration executive order on Wednesday

దీంతో కొత్త చట్టం తేవాలని ట్రంప్ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ట్రావెల్ బ్యాన్ లో మార్పులు చేర్పులు చేశారు.అయితే గత వారంలోనే ఈ ఎగ్జిక్యూటివ్ పై ట్రంప్ సంతకం చేయాలని నిర్ణయించారు.అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను వారం వరకు వేచి చూసినట్టుగా అమెరికా అంతర్గత భద్రత వ్యవహరాల అధికారిక ప్రతినిధి సియాన్ స్పైనర్ చెప్పారు.

ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారు అమెరికాలో అడుగుపెట్టకూడదంటూ డొనాల్డ్ ట్రంప్ అప్పటికప్పుడు కొత్త ఎగ్జిక్యూటివ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే ఫెడరల్ కోర్టు జడ్జి ట్రంప్ నిర్ణయం చెల్లదని తీర్పు చెప్పారు.దీంతో ఆయా దేశాలకు చెందినవారికి ఊరట లభించింది.

ఈ దఫా గతంలో జారీ చేసిన కొత్త ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకొని సంతకాలు చేయనున్నారు ట్రంప్ . అయితే అందులో ఎలాంటి అంశాలు పొందుపర్చారని ఇంకా తెలియాల్సి ఉంది.

English summary
US President Donald Trump is likely to sign a new immigration executive order on Wednesday, a day after addressing lawmakers at a joint session of Congress. Trump had initially planned to sign the new order last week, but according to Homeland Security spokesperson Sean Spicer, the president was apparently holding off the decision “to make sure that when we execute this, it’s done in a manner that’s flawless.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X