'అబ్దుల్ ఓ జిహాదీ!'.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్!

అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కింది. డెమోక్రటిక్ పార్టీ తరఫున మిచిగాన్ రాష్ట్రం నుంచి సెనెట్ బరిలో ఉన్న ముస్లిం అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయ్యద్‌ను లక్ష్యంగా చేసుకుని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. తన ప్రచార ప్రసంగంలో సయ్యద్‌ను నేరుగా సంబోధిస్తూ.. "నువ్వు ఎలా ఉన్నావు అబ్దుల్? అబ్దుల్ ఓ జిహాదీ" అంటూ విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్స్ అమెరికా రాజకీయ వర్గాలతో పాటు అంతర్జాతీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

నీ బాడీని షేప్‌లో పెట్టుకో. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నావు
నీ బాడీని షేప్‌లో పెట్టుకో. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నావు

ఉగ్రవాద ముద్ర.. 9/11 ప్రమాదాల ప్రస్తావన
మిచిగాన్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ఎల్-సయ్యద్‌ను 'ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన జిహాదీ సభ్యుడు'అని ఆరోపించారు. 2001 సెప్టెంబర్ 11 నాటి దాడుల విషాదాన్ని గుర్తుచేస్తూ.. ఆయన ధోరణి దేశ భద్రతకు ఏమాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఒకవేళ నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఎల్-సయ్యద్ గెలిచి యూఎస్ సెనెట్‌లోకి ప్రవేశిస్తే.. ఆయనను లోపలికి అనుమతించే ముందు రోజు మెటల్ డిటెక్టర్లతో కఠిన భద్రతా తనిఖీలు జరపాలని ట్రంప్ పేర్కొన్నారు. ఎల్-సయ్యద్ కుటుంబానికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయన్న విమర్శలతో పాటు సెనెటర్ గా గెలిచినా ఆయనకు సున్నితమైన జాతీయ భద్రతా సమాచారాన్ని పొందే అర్హత ఇవ్వకూడదని ట్రంప్ అన్నారు. ఈ ఆరోపణలను ఎల్-సయ్యద్ తీవ్రంగా ఖండించారు. తమ మతాన్ని, గుర్తింపును అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం ట్రంప్ ద్వేషపూరిత ప్రచారం చేస్తున్నారని డెమోక్రటిక్ నేతలు విమర్శించారు.

Donald Trump Stirs Controversy Calling Democratic Candidate Abdul El-Sayed Jihadi during a Campaign rally

ప్రచార సభలో ట్రంప్‌కు చేదు అనుభవం
మరోవైపు ఫ్లోరిడాలోని డేటోనా బీచ్‌లో జరిగిన భారీ ప్రచార సభలో డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో నిరసనకారులు నాలుగు సార్లు అడ్డంకులు సృష్టించారు. మధ్యంతర ఎన్నికల ప్రాముఖ్యత గురించి ట్రంప్ మాట్లాడుతుండగా.. నిరసనకారులు నినాదాలు చేస్తూ ప్రసంగానికి భంగం కలిగించారు. వరుస అడ్డంకులతో తీవ్ర అసహనానికి గురైన ట్రంప్ నిరసనకారుడి వైపు మళ్లీ.. "నోరు మూసుకో లూజర్! ఎంత పెద్ద లూజరో వీడు. ఇతడిని వెంటనే ఇక్కడి నుంచి బయటకు పంపండి" అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. నిరసనకారులు ఉద్దేశపూర్వకంగానే తన పంచ్ లైన్లను అడ్డుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.

ఒబామా సరికొత్త వ్యూహం! ట్రంప్‌కు ఇదే ఆఖరి అవకాశం..
ఒబామా సరికొత్త వ్యూహం! ట్రంప్‌కు ఇదే ఆఖరి అవకాశం..

చరిత్ర సృష్టిస్తున్న ముందస్తు ఓటింగ్
మరోవైపు అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ నమోదులో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్ ల్యాబ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 4.3 కోట్లకు పైగా ఓటర్లు ముందస్తు ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 40 నుంచి 50 లక్షల మంది ముందస్తు ఓటింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. మరో కొన్న రోజుల్లో పూర్తిస్థాయి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సెనెట్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+