ముగ్ధ మృతి వెనుక అసలు నిజాలేంటి? ఎవరికీ తెలియకుండా ఇండియాకి ఎందుకొచ్చింది?

విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనే కలతో గత ఏడాది జూలైలో లండన్‌కు వెళ్ళింది. అక్కడ ఒంటరిగా నివసిస్తూ ఎంబీఏ చదువుతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా చేసుకుంటోంది. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా టచ్‌లోనే ఉంది. అయితే, ఆమె ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా భారతదేశానికి తిరిగి వచ్చేసింది. చివరకు పూణెలోని ఒక అద్దె ఫ్లాట్‌లో ఆమె విగతజీవురాలిగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఆమె ఇండియాకు వచ్చిన విషయం చివరికి ఒక ఫుడ్ డెలివరీ ట్రాన్సాక్షన్ ద్వారా వెలుగులోకి రావడం గమనార్హం.

లండన్ నుంచి మిస్సింగ్ కంప్లైంట్!

చత్రపతి శంభాజీనగర్‌కు చెందిన ముగ్ధ దేశ్‌ముఖ్ అనే యువతి గత అక్టోబర్ 24వ తేదీన తన కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్‌కు రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు లండన్‌లోని ఆమె స్నేహితురాలిని సంప్రదించగా, అక్టోబర్ 22నే ముగ్ధతో చివరిసారిగా చాటింగ్ చేసినట్లు ఆమె తెలిపింది. దీంతో ఆందోళన చెందిన స్నేహితురాలు లండన్ పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. అయితే, ముగ్ధ ఆగస్టు చివరి వారంలోనే యూకే వదిలి వెళ్ళిపోయిందని లండన్ పోలీసులు తేల్చిచెప్పడంతో కుటుంబ సభ్యులకు దిగ్భ్రాంతి కలిగింది.

How a Food Delivery Order Exposed UK Returned Woman Mugdha Deshmukh s Secret Presence in India Today

బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో బయటపడిన అసలు నిజం!

కూతురు అడ్రస్ గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు ఇండియన్ హైకమిషన్‌ను ఆశ్రయించి సహాయం కోరారు. ఈ క్రమంలో ఆమె తండ్రి ముగ్ధ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించగా ఒక కీలక విషయం బయటపడింది. అక్టోబర్ 8 నుంచి 25 మధ్య కాలంలో అనేక ఫుడ్ డెలివరీ ట్రాన్సాక్షన్‌లు జరిగాయని, అందులో కొన్ని ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతం నుంచి జరిగినట్లు గుర్తించారు. దీన్ని బట్టి ముగ్ధ విదేశాల్లో లేదని, భారత్‌లోనే ఉందనే గట్టి నమ్మకంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

అర్ధరాత్రి 25 ఏళ్ల యువతి.. నగ్నంగా రోడ్డుపై పరుగులు, చెరువులో తేలిన శవం
అర్ధరాత్రి 25 ఏళ్ల యువతి.. నగ్నంగా రోడ్డుపై పరుగులు, చెరువులో తేలిన శవం

పూణె ఫ్లాట్‌లో శవమై కనిపించిన ముగ్ధ!

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఆధారాలతో ముగ్ధ ఆచూకీ కోసం గాలించారు. పూణెలోని గహుంజే ప్రాంతంలో ఉన్న 'లోధా బెల్మోండో' కాంప్లెక్స్‌లో ఆమె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, తాళాలు పగులగొట్టే వ్యక్తి సహాయంతో ఆమె ఉంటున్న ఫ్లాట్ తలుపులు తెరిచి చూడగా ముగ్ధ శవమై కనిపించింది. ఆమె శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు.

రాత్రి ఫోన్ కాల్… నిర్మానుష్య ప్రదేశం… చివరికి శవం..! బోరబండ మర్డర్ మిస్టరీ
రాత్రి ఫోన్ కాల్… నిర్మానుష్య ప్రదేశం… చివరికి శవం..! బోరబండ మర్డర్ మిస్టరీ

అసలు ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు!

పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ముగ్ధ గత ఏప్రిల్ నెలలోనే ఆ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నప్పటికీ, ఆగస్టు నుంచి అక్కడ నివసించడం మొదలుపెట్టింది. అసలు ఆమె లండన్ నుంచి రహస్యంగా ఎందుకు వచ్చారు? కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు? ఆమె మృతికి గల అసలు కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+