న్యూజిలాండ్ కోసం టీమిండియాలో స్పీడ్‌స్టర్ కు పిలుపు: భారీ మార్పులు

న్యూజిలాండ్‌తో త్వరలో జరగనున్న అయిదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీకి చోటు దక్కింది. తొలి మూడు వన్డేల కోసం అతన్ని జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. మొదట అకిబ్ నబీ చివరి రెండు మ్యాచ్‌ల కోసమే సెలెక్ట్ అయ్యాడు. తాజా మార్పుల ప్రకారం.. సిరీస్ ప్రారంభం నుంచే అతను జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

హ్యామ్ స్ట్రింగ్ గాయం కారణంగా ప్రసిద్ధ్ కృష్ణ వన్డే సిరీస్ మొత్తానికీ దూరం అయ్యాడు. దీంతో అతని స్థానంలో అకిబ్ నబీని వన్డే సిరీస్ లో అన్ని మ్యాచ్ లు కూడా ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మొదటి వన్డేకు మాత్రమే అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఇతర యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో ప్రాతినిథ్యాన్ని వహించే అవకాశం దక్కింది.

Pacer Auqib Nabi added to India squad for ODIs against New Zealand as Prasidh Krishna Ruled Out

న్యూజిలాండ్‌తో జరిగే మొదటి మూడు మ్యాచ్‌లకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పేస్ బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీకి చోటు లభించింది. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్ల కేటగిరీలో అక్షర్ పటేల్, నమన్ ధీర్ తుదిజట్టులో ఆడే అవకాశం ఉంది.

పెళ్లిళ్ల సీజన్ వేళ.. పసిడి ధర పాతాళానికి
పెళ్లిళ్ల సీజన్ వేళ.. పసిడి ధర పాతాళానికి

న్యూజిలాండ్ తో జరగబోయే మొదటి మూడు వన్డేల కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో.. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, కుల్ దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకిబ్ నబీ ఉన్నారు. నితీష్ మాత్రం మొదటి వన్డేకు మాత్రమే అందుబాటులో ఉంటాడు.

గ్లెన్ ఫిలిప్స్ పిడుగులు: టీమిండియా ముందు కొండంత టార్గెట్
గ్లెన్ ఫిలిప్స్ పిడుగులు: టీమిండియా ముందు కొండంత టార్గెట్

ఈ సిరీస్‌లోని నాలుగు, అయిదో వన్డేలకు కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ స్వీకరిస్తాడు. ఈ మ్యాచ్‌లల్లో తిలక్ వర్మ, వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర, పేసర్ యశ్ ఠాకూర్ జట్టులోకి వస్తారు. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

మన శ్రీసిటీలో రూపుదిద్దుకున్న డ్రైవర్‌ లెస్ మెట్రో రైలు: ఆక్వా లైన్ లో పరుగులు
మన శ్రీసిటీలో రూపుదిద్దుకున్న డ్రైవర్‌ లెస్ మెట్రో రైలు: ఆక్వా లైన్ లో పరుగులు

మొదటి వన్డే నవంబర్ 4న ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో ఆరంభమౌతుంది. రెండో వన్డే 7వ తేదీన వెల్లింగ్టన్ లో జరుగుతుంది. 10వ తేదీన జరిగే మూడో వన్డేకు హామిల్టన్ సెడాన్ పార్క్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 13, 15 తేదీల్లో చివరి రెండు వన్డేలు ఉంటాయి. ఈ రెండింటికీ కూడా మౌంట్ మావుంగనుయ్ స్టేడియం వేదిక. ఈ మ్యాచ్ లన్నీ కూడా భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు మొదలవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+