మర్యాదగా శాంతి చర్చలకు రండి.. లేదంటే పాక్‌లాగే మీకూ..: పాలస్తీనాకు ట్రంప్ హెచ్చరికలు

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: పాకిస్తాన్‌కు సైనికసాయం నిలిపివేసిన అమెరికా పాలస్తీనా విషయంలోనూ అదే పని చేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలకు పాలస్తీనా అంగీకరించకపోతే అమెరికా నుంచి సాయం ఆగిపోతుందని ట్రంప్ ఓ ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సరైన చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం, ఆ తరువాత కొన్ని గంటలకే పాకిస్తాన్‌కు 255 మిలియన్ డాలర్ల సైనికసాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే.

నిధుల ఆపివేత.. పాలస్తీనాకూ అదే వాత...

నిధుల ఆపివేత.. పాలస్తీనాకూ అదే వాత...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా పాలస్తీనాను టార్గెట్ చేశారు. పాకిస్తాన్ విషయంలో తీసుకున్న నిర్ణయమే పాలస్తీనా విషయంలోనూ తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తించే విషయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ట్రంప్... పాలస్తీనాకు సాయం చేయడం వల్ల అమెరికాకు ఎలాంటి గౌరవం, ప్రశంసలు దక్కడం లేదని ట్వీట్ చేశారు.

జెరూసలేం వ్యవహారమే...

జెరూసలేం వ్యవహారమే...

ఇజ్రాయెల్ రాజధానిగా ఇకనుంచి జెరూసలేంను తాము గుర్తిస్తున్నామని, తమ రాయబార కార్యాలయాన్ని కూడా జెరూసలేంకు తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే పాలస్తీనా నుంచి దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ట్రంప్ ప్రకటనపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకంగా ఓటు కూడా వేశాయి.

చర్చలకు రాకుంటే అంతేమరి...

చర్చలకు రాకుంటే అంతేమరి...

మరోవైపు ఇజ్రయెల్‌తో శాంతి చర్చలకు పాలస్తీనా అధారిటీ చాలా రోజులుగా విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పాలస్తీనాపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌ పాలకులకు హెచ్చరికలు జారీ చేసిన ఆయన తన ట్వీట్ బాణాలను పాలస్తీనావైపు తిప్పారు. ‘పాలస్తీనా కోసం ఏటా వందల మిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నాం.. కానీ ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలకు మాత్రం ఆ దేశం సుముఖత చూపించడం లేదు.. ఇక భవిష్యత్తులో మేం పాలస్తీనాకు ఎందుకు సాయం చేయాలి?' అని ట్రంప్ తన ట్వీట్‌లో ప్రశ్నించారు.

అమెరికా సాయం ఆగిపోతుంది, అంతే: నిక్కీ హేలీ

అమెరికా సాయం ఆగిపోతుంది, అంతే: నిక్కీ హేలీ

ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి నిక్కీ హేలీ కూడా.. శాంతి చర్చలను పాలస్తీనా నిరాకరిస్తూ ఉంటే ఆ దేశానికి అమెరికా సాయం నిలిపివేస్తుందని స్పష్టం చేశారు. ఐరాస కార్యాలయం వద్ద మీడియాతో ఆమె మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. పాలస్తీనా శాంతి చర్చలకు అంగీకరించేంత వరకు అమెరికా నుంచి నిధులు ఇవ్వకూడదని ట్రంప్ భావిస్తున్నారని నిక్కీ హేలీ పేర్కొన్నారు. తాజాగా పాలస్తీనాకు అమెరికా సాయం నిలిపివేస్తామంటూ ట్రంప్ చేసి ట్వీట్ కూడా దీనిని బలపరుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
America may withhold aid money to the Palestinians if they walk away from peace negotiations, Donald Trump threatened. In a pair of tweets, Mr Trump wrote that “we pay the Palestinians HUNDRED OF MILLIONS OF DOLLARS a year and get no appreciation or respect”. “We have taken Jerusalem, the toughest part of the negotiation, off the table, but Israel, for that, would have had to pay more,” Mr Trump said in reference to his decision to recognise Jerusalem as the capital of Israel.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి