ట్రంప్ ఆపబోయే నెక్స్ట్ వార్ ఇదే.. ! నోబెల్ టార్గెట్ ఫిక్స్ ?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచదేశాల్లో యుద్ధాలు ఆపడమే లక్ష్యంగా పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ కు వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. రెండు దేశాల మధ్య యుద్దం ఆపినట్లు ఆయన ప్రకటించుకోగానే మరో రెండు దేశాలు సిద్దంగా ఉంటున్నాయి. అక్కడ యుద్ధం ముగించేసరికి మరో రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇలాగే గతంలో భారత్-పాకిస్తాన్, ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-ఇరాన్ సహా పలు యుద్ధాలు ఆపిన ట్రంప్ ఇప్పుడు మరో యుద్దం ఆపుతానని ప్రకటించారు.
ప్రస్తుతం ఆసియా ఖండంలో పొరుగుదేశాలైన పాకిస్తాన్ - ఆప్ఘనిస్తాన్ మధ్య యుద్ధం కాకపోయినా తీవ్రమైన పోరు సాగుతోంది. ఇందులో తాజాగా ముగ్గురు ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లు కూడా చనిపోయారు. ఓవైపు ఆప్ఘనిస్తాన్ తో తాలిబాన్లు భారత్ తో మైత్రి కోరుకుంటుంటే మరోవైపు పాకిస్తాన్ వారితో యుద్దం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దులు కాల్పులతో మార్మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం పాకిస్తాన్-ఆప్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్దం ఆపడమే తన తదుపరి లక్ష్యమని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ఆపానని, ఇప్పుడు పాక్-ఆప్ఘన్ యుద్దం కూడా ఆపుతానని ట్రంప్ వెల్లడించారు. అంతే కాదు ఇది తనకు చాలా సులువైన పని అని కూడా చెప్పేశారు. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ తనకు యుద్దాలు ఆపడం అంటే ఇష్టమని, పాక్-ఆప్ఘన్ ఇద్దరిలో ఎవరు ఎవరిపై దాడి చేసుకున్నా దాన్ని ఆపడం తన బాధ్యతని చెప్పేసారు.

తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని, రువాండా- కాంగో, భారత్-పాక్ ఇలా తాము పరిష్కరించిన అన్ని యుద్ధాలను చూడాలని ట్రంప్ కోరారు. అలాగే తాను యుద్దాలు పరిష్కరించిన ప్రతిసారీ వారు మీరు తర్వాత యుద్ధాన్ని కూడా ఆపితే నోబెల్ బహుమతి వస్తుందని చెప్తున్నారని, అయినా నోబెల్ బహుమతి రాలేదని గుర్తుచేసుకున్నారు. ఎవరో దానిని పొందారన్నారు. ఆమె చాలా మంచి మహిళని, ఆమె ఎవరో తనకు తెలియదని, కానీ చాలా ఉదారంగా ఉందని తాజా నోబెల్ గ్రహీతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను ఆ విషయాలన్నింటినీ పట్టించుకోనని, ప్రాణాలను కాపాడటం గురించి మాత్రమే దృష్టిసారిస్తానన్నారు. ఇప్పుడు పాక్-ఆఫ్ఘన్ వివాదం తొమ్మిదవ స్థానంలో ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications