భారతీయుల్ని తీసుకోవద్దు..! మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా దిగ్గజాలకు ట్రంప్ వార్నింగ్..!

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారతీయులపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇవాళ మరో భారీ షాకిచ్చారు. ఇప్పటికే భారతీయ వలసదారులతో పాటు విద్యార్ధుల్ని సైతం గ్రీన్ కార్డులు, వీసాల వంటి విషయాల్లో తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న ట్రంప్.. ఇప్పుడు వారి ఉద్యోగాలపై పడ్డారు. ఈ మేరకు టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google) సహా ఇతర కంపెనీలకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు.

ఇవాళ వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ (AI) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ కంపెనీలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా టెక్ కంపెనీల గ్లోబల్ మైండ్ సెట్ పై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికన్లను వదిలేసి భారతీయులకు ఉద్యోగాలు ఇస్తుండటంపై అభ్యంతరం తెలిపారు. టెక్ దిగ్గజాల తీరుతో అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు.

Donald trump warned tech giants including Microsoft google against jobs to indians

అమెరికాలో లభిస్తున్న స్వేచ్ఛతో ఇక్కడి టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు, ఆఫీసులు పెడుతున్నాయని ట్రంప్ విమర్శించారు. ఇప్పటివరకూ తమ దేశంలోని టెక్ కంపెనీలు చైనాలో పెట్టుబడులు, భారతీయ ఉద్యోగుల నియామకాలు, ఐర్లాండ్ సాకుతో తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛగా ఉన్నాయని, ఇకపై ఆ రోజులు ఉండబోవని ఆయా సంస్థలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చేసారు. ఏఐ రేసులో ఉండాలంటే మాత్రం సిలికాల్ వ్యాలీలో ఇకపై దేశభక్తి అవసరమని ట్రంప్ వారికి చురకలు అంటించారు.

ఇవాళ జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో ప్రస్తుతం ఏఐ దూకుడుకు ఉన్న ఆటంకాలు తొలగించడంతో పాటు వాటి అభివృద్ధి వేగంగా ఉండేలా చూడటం, ప్రభుత్వ నిధులు తీసుకునే సంస్థలు తయారు చేస్తున్న ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరి పాటించడం వంటివి ఉన్నాయి. తన ప్రత్యర్థి ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వ ఏఐ టూల్స్ లభించకుండా చేయడం ఈ చివరి ఒప్పందం టార్గెట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+