ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్.. ఏ అంశాలపై చర్చించారన్న దానిపై ఉత్కంఠ..

అమెరికా- భారత్ మధ్య నెలకున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సోమవారం టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సమాచారాన్ని భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. గోర్ ఈ చర్చల వివరాలను వెల్లడించనప్పటికీ, ఆయన 'వేచి చూడండి' అని పేర్కొన్నారు.

భారత్ లోని అమెరికా రాయబారి చేసిన ఈ పోస్ట్.. భారత్- అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందం ప్రకటించవచ్చనే ఊహాగానాలకు దారితీసింది. గతంలో ట్రంప్ భారత్ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించి, ఇరు దేశాల సంబంధాల్లో అనిశ్చితిని సృష్టించినప్పటికీ ఇప్పుడు ఈ ఒప్పంద ప్రకటన నేపథ్యంలో ఆశలు పెరిగాయి.

ఇక భారత్, అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్యపరమైన ఉద్రిక్తతల మధ్య ఈ ఫోన్ కాల్ జరిగింది. ఈ సంభాషణను భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ధృవీకరించారు. ఈ మేరకు గోర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడే ప్రధాని మోదీతో మాట్లాడారు. వేచి చూడండి (STAY TUNED)" అని పోస్ట్ చేశారు.

donaldTrump and Modi Phone Call Amid Trade Tensions US Envoy Says Stay Tuned for Big Update

అయితే ఇరు దేశాల మధ్య చర్చకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ క్రమంలో రాయబారి సెర్గియో గోర్ "స్టే ట్యూన్డ్" అని చెప్పడం ద్వారా ఇరు దేశాల దౌత్య సంబంధాలకు సంబంధించి త్వరలో మరిన్ని కీలక అప్‌ డేట్స్ లేదా విధానపరమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+