ఇజ్రాయెల్, సౌదీకి ట్రంప్ భారీ ఆఫర్.. $15.6 బిలియన్ విలువైన ఆయుధాల విక్రయం..!
అమెరికా విదేశాంగ శాఖ.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా దేశాలకు సుమారు $15.6 బిలియన్ల విలువైన భారీ ఆయుధాల విక్రయాలకు (FMS) ఆమోదం తెలిపింది. ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును అడ్డుకోవడం, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఈ మేరకు ఇజ్రాయెల్ కు $6.7 బిలియన్లు, సౌదీకి $9 బిలియన్ల PAC-3 క్షిపణి నిరోధకాలను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ విక్రయాలు ప్రాంతీయ భద్రతలో కీలకమైన మార్పులకు దారితీయనున్నాయి.
ఇజ్రాయెల్ కోసం నాలుగు విదేశీ సైనిక విక్రయ (FMS) ఒప్పందాలు జరిగాయి. $3.8 బిలియన్ల 30 AH-64E అపాచీ హెలికాప్టర్లు, $1.98 బిలియన్ల 3,250 జాయింట్ లైట్ టాక్టికల్ వాహనాలు, $740 మిలియన్ల నామెర్ ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్ పవర్ ప్యాక్ లు, $150 మిలియన్ల అంచనాతో AW119Kx తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్లు.
అలాగే సౌదీ అరేబియాకు $9 బిలియన్ల 730 PAC-3 క్షిపణి నిరోధకాలు, అనుబంధ పరికరాలు విక్రయించనున్నారు. ఈ నెలలో లాక్ హీడ్, పెంటగాన్ 2030 చివరి నాటికి PAC-3 ఉత్పత్తిని సంవత్సరానికి 2,000 కు మూడు రెట్లు పెంచే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ విస్తరణ సౌదీ ఒప్పందానికి మరింత ఊతమిస్తుంది. "ప్రతిపాదిత ఒప్పందం సౌదీ అరేబియా ప్రస్తుత, భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధునాతన వాయు రక్షణ క్షిపణులను అందించడం ద్వారా సమగ్ర వాయు, క్షిపణి రక్షణ (IAMD) వ్యవస్థను బలపరుస్తుంది" అని అమెరికా తన ప్రకటనలో పేర్కొంది.

"ఈ బలోపేతమైన సామర్థ్యం సౌదీ అరేబియా, అమెరికా, స్థానిక మిత్రదేశాల బలగాలను రక్షిస్తుంది. [US సెంట్రల్ కమాండ్] ప్రాంతంలో IAMD కు సౌదీ అరేబియా సహకారాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది" అని ప్రకటన వివరించింది. అయితే ఈ ప్రకటనల సమయం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఇరాన్ కు వ్యతిరేకంగా చర్యల కోసం అమెరికా ప్రాంతంలో బలగాల మోహరింపును పెంచుతోంది. ఒకవేళ జరిగితే, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలు టెహ్రాన్ ప్రతీకార దాడికి ప్రమాదంలో పడొచ్చు.
మరోవైపు ఇజ్రాయెల్ నాయకుడు బెంజమిన్ నెతన్యాహు అమెరికా నుండి సైనిక సహాయాన్ని తగ్గించుకోవాలని కోరినట్లు ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఒబామా హయాంలో చర్చించి కుదుర్చుకున్న దశాబ్ద కాల సైనిక సహాయ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఇరు దేశాలు పనిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications