Doomsday clock హెచ్చరికలు; 85 సెకన్ల దూరంలో వినాశనం
ప్రపంచం ప్రమాదకరమైన మలుపులో నిలిచిందని అంతర్జాతీయ శాస్త్రీయ వర్గాలు మరోసారి హెచ్చరిస్తున్నాయి. మునుపెన్నడూ లేనంతగా మానవాళి స్వయంగా సృష్టించుకున్న విధ్వంసానికి చేరువైందని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ 'బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్'(Bulletin of the Atomic Scientists) ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ రాజకీయ పరిణామాలు, అణ్వస్త్ర దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కలిసి ప్రపంచ భవిష్యత్తును తీవ్ర అనిశ్చితిలోకి నెట్టేశాయని సంస్థ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతీకాత్మకంగా ఉపయోగించే 'డూమ్స్‌డే క్లాక్'(Doomsday clock) సమయాన్ని మరోసారి ముందుకు జరిపినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ గడియారం అర్ధరాత్రి 12 గంటలకు కేవలం 85 సెకన్ల దూరంలో ఉందని వెల్లడించింది. అర్ధరాత్రి అంటే మానవాళి సంపూర్ణ వినాశనానికి ప్రతీకగా శాస్త్రవేత్తలు భావిస్తారు.

డూమ్స్‌డే క్లాక్ (Doomsday clock) అంటే ఏమిటి?
ప్రపంచం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందన్నది అంచనా వేసేందుకు 'బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్' ఒక ఊహాజనిత గడియారాన్ని ఉపయోగిస్తుంది. దానినే డూమ్స్‌డే క్లాక్గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సైనిక, పర్యావరణ, సాంకేతిక పరిణామాలను బట్టి ఈ గడియారాన్ని ముందుకు లేదా వెనక్కి జరుపుతుంటారు. గడియారం అర్ధరాత్రికి ఎంత దగ్గరగా ఉందో... మానవాళి అంత ప్రమాదంలో ఉందన్న సంకేతంగా భావిస్తారు. గత ఏడాది ఈ గడియారం అర్ధరాత్రికి 89 సెకన్ల దూరంలో ఉండగా, తాజా పరిణామాల నేపథ్యంలో మరో 4 సెకన్లు ముందుకు కదిలింది.
పెరుగుతున్న అణు యుద్ధ ముప్పు
ఈ ప్రమాదకర పరిస్థితులకు ప్రధాన కారణంగా అణ్వస్త్ర దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణలను సంస్థ ప్రస్తావించింది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఈ యుద్ధం ఎటువైపు మళ్లుతుందో అన్న అనిశ్చితి అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోందని తెలిపింది. ఇదే సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య గతేడాది మే నెలలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలను కూడా సంస్థ ఉదహరించింది. అణ్వస్త్రాలు కలిగిన దేశాల మధ్య చిన్న స్థాయి ఘర్షణలు కూడా పెద్ద విపత్తుకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇరాన్ అంశం, మధ్యప్రాచ్య మంటలు
మధ్యప్రాచ్యంలోనూ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని నివేదిక చెబుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ అణ్వస్త్రాల దిశగా అడుగులు వేయవచ్చన్న భయం అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోందని సంస్థ పేర్కొంది. ఇది మరో పెద్ద అణు సంక్షోభానికి దారితీయవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.
అణ్వస్త్రాలకే కాదు... ఇతర ముప్పులూ
కేవలం అణు యుద్ధమే కాకుండా, మానవాళిని బెదిరిస్తున్న ఇతర ప్రమాదాలను కూడా బులెటిన్ ప్రస్తావించింది. వేగంగా మారుతున్న వాతావరణ మార్పులు, జీవసాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసే అవకాశం, సరైన నియంత్రణలు లేకుండా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం.. ఇవన్నీ కలిపి ప్రపంచాన్ని మరింత అస్థిరంగా మారుస్తున్నాయని స్పష్టం చేసింది.
హెచ్చరిక మాత్రమే కాదు... బాధ్యత కూడా
డూమ్స్‌డే క్లాక్‌ను ముందుకు జరపడం కేవలం హెచ్చరిక మాత్రమే కాదని, ప్రపంచ నాయకులకు ఇది ఒక బాధ్యతా పిలుపు అని సంస్థ పేర్కొంది. యుద్ధ వాతవరణం, జాతీయవాద అహంకారాలు, నియంత్రణలేని సాంకేతిక విస్తరణను వెంటనే కట్టడి చేయకపోతే మానవాళి తిరిగిరాని దారిలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రపంచం ఇప్పుడు ఉన్న స్థితి చూస్తే... వినాశనానికి ఇంకా కొన్ని సెకన్లే మిగిలాయా? లేక మానవుడు తన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఇంకా ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం ప్రపంచ నాయకుల చేతుల్లోనే ఉందన్న సంకేతమే ఈ డూమ్స్‌డే క్లాక్ చెబుతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications