మూడో సంతానానికి చైనా సర్కారు గ్రీన్ సిగ్నల్: నజరానాలు కూడా, చైనీయుల మాటేమిటంటే?

బీజింగ్: ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనానే. అయితే, ఈ దేశంలో జననాలు రేటు తగ్గి మరణాలు రేటు పెరుగుతోంది. అంతేగాక, వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. దీంతో చైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇకపై ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలను కనేందుకు చైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ముగ్గురు సంతానికి చైనా గ్నీన్ సిగ్నల్

ముగ్గురు సంతానికి చైనా గ్నీన్ సిగ్నల్


చైనీస్ పొలిట్‌బ్యూరో సిఫార్సుల మేరకు ప్రజలు మూడో సంతానాన్ని కూడా కనవచ్చంటూ పేర్కొంది. చైనా జనాభా నిర్మాణాన్ని మెరుగుపర్చేందుకు ప్రజలు ముగ్గురు సంతానాన్ని కనాలని కోరింది. జనాభా నియంత్రణను పెంపొందించడానికి చైనా జాతీయులు ఒకే బిడ్డను కలిగి ఉండటానికి అనుమతించే అప్పటి కఠినమైన చట్టాన్ని జి జిన్‌పింగ్ పరిపాలన రద్దు చేసిన ఐదు సంవత్సరాల తరువాత సీపీసీ ఈ ప్రధాన ప్రసవ విధాన మార్పు ప్రస్తావన తెచ్చింది. 1950 తర్వాత ఈ దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల రేటు చాలా మందగించినట్లు తేలిందని చైనా ప్రభుత్వరంగ జిన్హువా నివేదించింది.

ఒక సంతానంతో ఒంటరైన తల్లిదండ్రులు

ఒక సంతానంతో ఒంటరైన తల్లిదండ్రులు

నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) స్టాండింగ్ కమిటీ ఈ 'రివైజ్డ్ పాపులేషన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ లా'కు ఆగస్టు 19న ఆమోదం తెలిపింది. దీంతో మూడో సంతానాన్ని కూడా చైనీయులు కనవచ్చు. అయితే, మూడో సంతానాన్ని కని పెంచాలంటే ప్రభుత్వ మద్దతు కూడా దంపతులకు అవసరమవుతుందని సీపీఐ అభిప్రాయపడుతోంది. ఇలాంటి దంపతులు పెరిగితే అదో సమస్యగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా, వన్ చైల్డ్ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు ఒంటరివారైపోయారు. ఇప్పుడు తీసుకొచ్చిన మూడో సంతానం విధానంగా చైనా పరిస్థితిని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక సంతానంతో తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇప్పుడు ముగ్గురు సంతానం విధానంతో కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ముగ్గురు సంతానం అంటే ప్రభుత్వ మద్దతు కావాల్సిందే.. నజరానాలు

ముగ్గురు సంతానం అంటే ప్రభుత్వ మద్దతు కావాల్సిందే.. నజరానాలు


ముగ్గురు సంతానాన్ని పెంచడం ఇప్పుడు పరిస్థితుల్లో కష్టాసాధ్యమేనని సామాన్య చైనీయులు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగం, ఇతర సమస్యల కారణంగా చైనీయులు ఒకరు లేదా ఇద్దరు సంతానానికే పరిమితమయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలోనే చాలా మంది మహిళలు సంతానం కనేందుకు కొంత సమయం తీసుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు సంతానం కనాలని చెబుతున్న చైనా ప్రభుత్వం పలు నజరానాలను కూడా ప్రకటించింది.

చైనా మూడో సంతానం ఎలాంటి ఫలితాన్నిస్తుందో..?

చైనా మూడో సంతానం ఎలాంటి ఫలితాన్నిస్తుందో..?

చైల్డ్ బర్త్ ఇన్స్యూరెన్స్, టాక్సెస్, ఎడ్యుకేషణ్, హౌసింగ్, ఉద్యోగ కల్పన లాంటి అంశాలపై చైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెటర్నిటీ సెలవులతోపాటు మెటర్నిటీ ఇన్స్యూరెన్స్ పద్ధతిని కూడా తీసుకువచ్చేందుకు చైనా సర్కారు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, 1980 నుంచి చైనా జనాభాను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఒకే బిడ్డను కనాలంటూ అప్పుడు చైనా సర్కారు శరతు విధించింది. ఆ తర్వాత దేశంలో వృద్ధ జనాభా పెరిగిపోవడంతో ఇద్దరు సంతానంకు అనుమతిచ్చింది. ఇటీవల కాలంలో బర్త్ రేట్ గణనీయంగా తగ్గడంతో ఆందోళన చెందిన ప్రభుత్వం.. ఇప్పుడు మూడో సంతానంకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనాభా నిర్మాణాన్ని మెరుగుపర్చాలంటే మూడో సంతానం విధానం చాలా ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది. అయితే, ఇది ఎంత వరకు సత్ఫలితాలిస్తుందో వేచిచూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+