Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో ఆఫ్ఘనిస్తాన్: ఇరాక్ ప్రధాని హత్యకు భారీ కుట్ర: నివాసంపై బాంబుల వర్షం

బాగ్దాద్: ఇరాక్.. మరోసారి భగ్గుమంది. ఆ దేశ ప్రధానమంత్రి ముస్తఫా అల్-కధిమిని హత్య చేయడానికి కుట్ర పన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆయన నివాసంపై బాంబుల వర్షాన్ని కురిపించారు. దీనికోసి డ్రోన్లను వినియోగించారు. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఉదంతం పట్ల ఇరాక్ మిలటరీ అధికారులు స్పందించారు. తమ దేశ ప్రధానమంత్రిని హత్య చేయడానికి పన్నిన కుట్రగా ధృవీకరించారు. దీన్ని ఉగ్రవాద చర్యగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.

హై సెక్యూరిటీ జోన్‌లో..

హై సెక్యూరిటీ జోన్‌లో..

ఈ దాడికి తామే కారణమంటూ ఇప్పటిదాకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించుకోలేదు. రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్ ప్రాంతంలో ఉంటుంది ప్రధాని ముస్తఫా అల్-కధిమి అధికారిక నివాసం. హైసెక్యూరిటీ జోన్ ఇది. చుట్టూ వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు ఉంటాయి. ఇరాక్ పార్లమెంట్ భవనం కూడా సమీపంలోనే ఉంటుంది. భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవెనాంట్ టెర్రరిస్టులను దృష్టిలో ఉంచుకుని- కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారిక్కడ.

డ్రోన్లతో దాడి..

అలాంటి హైసెక్యూరిటీ జోన్‌లో ఉన్న ప్రధాని నివాసంపై ఈ దాడి సంభవించింది. ఈ తెల్లవారు జామున శక్తిమంతమైన బాంబులు నింపిన డ్రోన్లు ఈ దాడి చేశాయి. బాంబుల వర్షాన్ని కురిపించాయి. ఆ సమయంలో ప్రధాని భవనంలోనే ఉన్నారు. దాడి జరిగిన వెంటనే భద్రత దళాలు ఆయనను అండర్‌గ్రౌండ్‌లోకి తీసుకెళ్లాయి. ఆయనను సురక్షితంగా తప్పించాయి. ఈ క్రమంలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో అక్రమాలు..

ఎన్నికల్లో అక్రమాలు..

ఇరాక్‌లో కిందటి నెల సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరాన్ మద్దతుగా నిలిచిన షిటె మిలీషియా గ్రూప్‌కు మద్దతుదారులుగా భావిస్తోన్న వందలాది మంది కొద్దిరోజులోగా ప్రధాని నివాసం ఉన్న గ్రీన్‌జోన్ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు. సాధారణ ఎన్నికల్లో ఈ మిలీషియా గ్రూప్ ఓడిపోయింది. ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందనేది వారి ప్రధాన ఆరోపణ.

 ఆందోళనకారులపై కాల్పులు..

ఆందోళనకారులపై కాల్పులు..

దీనికి నిరసనగా నెలరోజులుగా అక్కడ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు ఈ అల్లర్లు మరింత ఉధృతం అయ్యాయి. ఆందోళనకారులు ప్రధాని ముస్తఫా నివాసం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిని నిలువరించడానికి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒకరిద్దరు ఆందోళనకారులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన చోటు చేసుకున్న రెండోరోజే- ప్రధాని నివాసంపై డ్రోన్ల సహాయంతో బాంబుదాడులు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సురక్షితంగా ఉన్నానంటూ..

సురక్షితంగా ఉన్నానంటూ..

ఈ ఘటన తరువాత- ప్రధాని ముస్తఫా స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్న రక్షణ బలగాలు తన వెంట ఉన్నంత వరకూ ఏమీ కాదని అన్నారు. ఈ బాంబుదాడిలో గాయపడ్డ సైనికులు, ఇతర సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోనివ్వమని అన్నారు.

మరో ఆఫ్ఘనిస్తాన్

మరో ఆఫ్ఘనిస్తాన్

ఇరాక్.. మరో ఆప్ఘనిస్తాన్‌లా క్రమంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏకంగా ప్రధానమంత్రి అధికారిక నివాసంపై బాంబుదాడులకు పాల్పడటాన్ని భద్రత వ్యవస్థ లోపంగా భావిస్తున్నారు. ఒకవంక తరచూ ఐసిస్ ఉగ్రదాడులు.. ఇఫ్పుడు కొత్తగా షిటె మిలీషియా తోడు కావడం ముస్తఫా ప్రభుత్వానికి సవాళ్లను విసిరినట్టయిందని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన కఠిన నిర్ణయాలను తీసుకుంటారని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+