వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నపిల్లల్ని చంపేయడం దారుణం: పాక్ ప్రధాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పరువు పేరిట కొందరు తమ పిల్లలను చంపేయడం అత్యంత హేయమైన చర్య అని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. తమ ఇష్టాటానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే పరువు పోతుందనే భావనతో తల్లిదండ్రులు సొంత పిల్లలను చంపుకోవడం దారుణం అన్నారు.

పరువు హత్యల కథా నేపథ్యంలో రూపొందించిన ఏ గర్ల్ ఇన్ ది రివర్: ది ప్రైస్ ఆఫ్ ఫర్గివ్‌నెస్ అనే చిత్రాన్ని ఆయన ఇస్లామాబాదులోని ప్రధాని కార్యాలయంలో చూశారు. అనంతరం ప్రధాని షరీఫ్ మాట్లాడారు. మహిళా హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

మద్యం మత్తులో మూత్రవిసర్జన

లండన్: బాగా తాగి విమానంలో సీటు మీద, ఫ్లోర్ మీద మూత్ర విసర్జన చేసిన ఓ ప్రయాణీకుడికి దాదాపు లక్ష రూపాయాల జరిమానా విధించారు. భారత్ నుంచి ఇంగ్లాండులోని బర్మింగ్ హామ్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానాన్ని జిను అబ్రహం అనే 39 ఏళ్ల ప్రయాణీకుడు ఎక్కాడు.

అతను విమానంలో మూత్ర విసర్జన చేశాడు. అతని ప్రవర్తనకు ఎయిర్ ఇండియా విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణీకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పదేళ్ల కొడుకుతో కలిసి ప్రయాణీస్తున్న అబ్రహంకు సంకెళ్లి వేసి, సీటు బెల్టులతో కుర్చీకి కట్టేశారు.

 Drunk Air India Passenger Fined 1000 Pounds For Urinating In Aisle

బర్మింగ్ హామ్‌లో విమానం దిగగానే వెంటనే అరెస్టు చేయగా.. బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు అతనికి 300 పౌండ్ల జరిమానా విధించింది. దాంతో పాటు పరిహారం కింద మరో 500 పౌండ్లు, ఖర్చుల కింద 185 పౌండ్లు, బాధితుల సర్‌ఛార్జీగా 30 పౌండ్లు చెల్లించాలని తీర్పు చెప్పారు.

అబ్రహం విమానంలో వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్నాడు. సీట్లోకి వెళ్లి కూర్చోమని సిబ్బంది చెప్పినా వినలేదు. విమానం అరగంటలో ల్యాండ్అవుతుందనగా ప్యాంటు తీసేసి విమానం ఫ్లోర్ మీద, సీటు మీద మూత్ర విసర్జన చేశాడని లాయర్ తెలిపారు.

English summary
A drunk passenger on an Air India flight from India to Birmingham was slapped with a hefty 1,000 pound penalty for urinating in the aisle, shocking the crew and sparking angry protests from other passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X